‘అమీగోస్’పై కళ్యాణ్ రామ్ భారీ ఆశలు!
విధాత: తన కెరీర్‌లో అతనొక్కడే, 118, హరే రామ్, పటాస్ వంటి హిట్లు ఉన్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్. చాలా రోజుల తర్వాత బింబిసార చిత్రంతో భారీ ఘన విజయం సాధించాడు. వశిష్ట దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఏకంగా 50 కోట్లను రాబట్టింది. దాంతో కళ్యాణ్ రామ్ తదుపరి నటిస్తున్న అమిగోస్ చిత్రంపై అంచనాలు బాగా పెరిగాయి. కళ్యాణ్ రామ్ కూడా […]

విధాత: తన కెరీర్‌లో అతనొక్కడే, 118, హరే రామ్, పటాస్ వంటి హిట్లు ఉన్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్. చాలా రోజుల తర్వాత బింబిసార చిత్రంతో భారీ ఘన విజయం సాధించాడు. వశిష్ట దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఏకంగా 50 కోట్లను రాబట్టింది. దాంతో కళ్యాణ్ రామ్ తదుపరి నటిస్తున్న అమిగోస్ చిత్రంపై అంచనాలు బాగా పెరిగాయి.
కళ్యాణ్ రామ్ కూడా ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నాడు. అందులో ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నెంబర్ వన్ ప్రొడక్షన్ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెబుతారు. అలాంటి ఒకే రూపంలో ఉండే ముగ్గులు వ్యక్తులు కలిస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.
అమిగోస్ చిత్రం అద్భుతంగా వచ్చిందని థియేటర్‌కు వచ్చిన వారెవరూ నిరాశతో తిరిగి వెళ్లరని కళ్యాణ్ రామ్ అంటున్నారు. అందరూ నాపై ఉంచిన నమ్మకాన్ని ఈసారి నిలబెట్టుకుంటాను అని హామీ ఇస్తున్నారు. ఇంకా ఈ చిత్రం టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలతో సూపర్ హిట్ చిత్రాలను అందించిన మైత్రి మూవీ మేకర్స్ నుండి వస్తున్న మూడో చిత్రం కావడం విశేషం. కేవలం ఒకటిన్నర నెలల గ్యాప్‌లోనే ఈ సంస్థ నిర్మించిన మూడో చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇక ఈ సినిమాలో బాలకృష్ణ నటించిన ధర్మక్షేత్రంలోని ఎన్నో రాత్రులు వస్తాయి గాని పాటను రీమిక్స్ చేశారు. వేటూరి సాహిత్యం అందించిన ఈ పాటకు ఇళయరాజా స్వరాన్ని అందించగా ఎస్పీ బాలు, చిత్ర పాడారు. ఇప్పుడు ఈ గీతాన్ని జిబ్రాన్ సరికొత్తగా రీమిక్స్ చేశారు. అప్పట్లో ఆ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అమిగోస్‌లో ఈ చిత్రంలోని పాట రీమిక్స్, అందులో నందమూరి కళ్యాణ్ రామ్ లుక్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఏది ఏమైనా ఈ చిత్రానికి ఈ పాటను ఓ స్పెషల్ అట్రాక్షన్‌గా చెప్పుకోవచ్చు. అందునా బాలయ్య బాబాయ్ చిత్రం నుంచి ఈ రీమిక్స్ చేయడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.