Kamal Haasan | ఆ కాస్ట్లీ గిఫ్ట్ చూస్తుంటే అర్థం కావడం లేదా.. శంకర్‌పై ఎంత నమ్మకమో?

Kamal Haasan | విధాత‌: కమల్ హాసన్ అంటేనే ఓ ప్రయోగం, అతడు చేసే ప్రతి సినిమాలోనూ ఏదో వైవిధ్యం ఉండి తీరుతుంది. ప్రత్యేకత లేనిదే కమల్ సినిమా ఉండదు. దశావతారం, భారతీయుడు ఇలా ప్రతీదీ ఇప్పటి జనరేషన్‌కి తగ్గట్టుగా, ఆకట్టుకునేలా తీసినవే. సినీ పరిశ్రమలో సాహసవంతమైన పాత్ర చేయాలంటే దానికి కమల్ ముందుంటాడు. సినిమాలో ప్రయోగాలను అతను చేసినట్టుగా ఇంకెవరూ చేసి ఉండరు. అది నటన అయినా, దర్శకత్వం అయినా, పాటైనా, డాన్స్ అయినా, డైలాగ్ […]

Reported by: Somu | latest | IST
Read Time: 4 mins

Kamal Haasan |

విధాత‌: కమల్ హాసన్ అంటేనే ఓ ప్రయోగం, అతడు చేసే ప్రతి సినిమాలోనూ ఏదో వైవిధ్యం ఉండి తీరుతుంది. ప్రత్యేకత లేనిదే కమల్ సినిమా ఉండదు. దశావతారం, భారతీయుడు ఇలా ప్రతీదీ ఇప్పటి జనరేషన్‌కి తగ్గట్టుగా, ఆకట్టుకునేలా తీసినవే. సినీ పరిశ్రమలో సాహసవంతమైన పాత్ర చేయాలంటే దానికి కమల్ ముందుంటాడు. సినిమాలో ప్రయోగాలను అతను చేసినట్టుగా ఇంకెవరూ చేసి ఉండరు. అది నటన అయినా, దర్శకత్వం అయినా, పాటైనా, డాన్స్ అయినా, డైలాగ్ మాడ్యూలేషన్ అయినా కమల్ చేసే తీరే వేరుగా ఉంటుంది.

ఇంతటి గొప్ప నటుడికి, శంకర్ లాంటి గొప్ప దర్శకుడు తోడైతే వాళ్ళ ఇద్దరి కలయికలో వచ్చిన ‘భారతీయుడు’ ఎంతగొప్ప హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఇక ఈ సినిమా సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ మొదలు పెట్టి రెండేళ్ళు కావస్తుంది.

మొదటి షెడ్యూల్‌ని భారీగానే తెరకెక్కించారు కానీ అనుకోని అవాంతరాలతో రెండేళ్ళపాటు షూటింగ్ ఆగిపోయింది. అయితే నిర్మాతల పట్టుతో మళ్ళీ ఈ సినిమా షూటింగ్ బ్యాలెన్స్ పూర్తి కాబోతుంది. దీనితో శంకర్ ఒకేసారి అటు ‘ఇండియన్ 2’ మరోవైపు ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్స్‌తో తెగ బిజీగా మ్యానేజ్ చేస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా కమల్ హాసన్ ఓ ట్వీట్ చేశారు. ఇండియన్ 2 రషెశ్ చూశానని, చాలా బాగా వచ్చాయని చెబుతూ శంకర్ పనితనాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. ట్వీట్‌తో సరి పెట్టేయకుండా శంకర్‌కి మంచి ఖరీదైన వాచ్‌ని బహుమతిగా కూడా ఇస్తున్నాడు కమల్.

ఓ వాచ్ ని శంకర్ చేతికి తొడుగుతున్న ఫోటోలు కూడా నెట్టింట షేర్ చేసాడు కమల్. ‘విక్రమ్’ హిట్ తర్వాత రాబోతున్న ‘ఇండియన్ 2’ పై ఆయన ఎంత నమ్మకంగా ఉన్నాడనేది.., విడుదలకు ముందే ఇటువంటి కాస్ట్లీ గిఫ్ట్ దర్శకుడికి ఇవ్వడం చూస్తుంటే అర్థమవుతోంది.