Karan Johar : నువ్వు గేనా.. ఆ స్టార్ డైరెక్టర్‌ని సూటిగా అడిగిన నెటిజన్
Karan Johar : సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీలు చాలా యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ రీసెంట్‌గా థ్రెడ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.ఆయన అభిమానులతో పది నిమిషాల పాటు ముచ్చటించారు.నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకి ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నమాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బడా నిర్మాత అయిన కరణ్ జోహార్ వ్యక్తిగత జీవితంపై చాలా […]

Karan Johar : సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీలు చాలా యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ రీసెంట్‌గా థ్రెడ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.ఆయన అభిమానులతో పది నిమిషాల పాటు ముచ్చటించారు.నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకి ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నమాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బడా నిర్మాత అయిన కరణ్ జోహార్ వ్యక్తిగత జీవితంపై చాలా మందిలో అనేక అపోహలున్నాయి. ఆయన సరోగసీ పద్ధతి ద్వారా ఇద్దరు పిల్లలకు తండ్రి కాగా, ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడు ఎవరో ఒకరు పలు అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు.
ఆన్‌లైన్ ఛాటింగ్‌లో ఓ నెటిజన్.. మీరు గే(స్వలింగ సంపర్కుల)నా? అని కరణ్‌ని డైరెక్ట్‌గా ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా కరణ్ జోహార్ చాలా కూల్‌గా సమాధానం ఇచ్చాడు. తానే గేనా కాదా అనేది చెప్పకుండా ‘నీకు ఇంట్రెస్ట్ ఉందా?’ అని సమాధానం ఇవ్వడంతో కరణ్ జోహార్ సెన్సాఫ్ హ్యూమర్ అదుర్స్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రశ్నని కరణ్ జోహార్ చాలా లైట్‌గా తీసుకున్నా కూడా కొందరు మాత్రం ఇందులో నిజం ఉందా లేదా అనే దానిపై చర్చ సాగిస్తున్నారు. కరణ్ జోహార్ గే అంటూ గతంలోను పలు విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
ధర్మ ప్రొడక్షన్‌లో ఎక్కువగా సినిమాలు తీస్తూ ఉండే కరణ్ జోహార్ ఆ మధ్య బ్రహ్మాస్త్ర అనే భారీబడ్జెట్ చిత్రం చేసాడు. పూరీ జగన్నాథ్‌తో కలిసి లైగర్ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు.ఇప్పుడు అలియా భట్, రణవీర్ సింగ్ జంటగా ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ అనే చిత్రం చేస్తున్నాడు. దీనికి కరుణ్ జోహార్ దర్శకుడు కాగా, దాదాపు ఏడు సంవత్సరాల విరామం తరువాత కరణ్ మళ్లీ ఓ సినిమాని డైరెక్టర్ చేయడం విశేషం. ఈ చిత్రంలో ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ లు కీలక పాత్రల్లో పోషించారు. మూవీన జూలై 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు.