Karimanagar కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో జన్మనిచ్చిన కమ్మర్పల్లి వాసి ప్రమాదం లేదంటున్న వైద్యులు విధాత బ్యూరో, కరీంనగర్: కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో ఓ శిశువు చేతులు, కాళ్లకు ఆరు వేళ్లతో జన్మించాడు. ఇటువంటివి అరుదుగా జరుగుతాయని, వంశ పారంపర్యంగా కూడా ఇలా జరిగేందుకు వీలుంటుందని వైద్యులు అంటున్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఎరుగట్ల గ్రామానికి చెందిన రవళి పురిటి నొప్పులతో బాధ పడుతుండగా తొలుత మెట్టుపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కోరుట్ల ప్రభుత్వ […]
Karimanagar
విధాత బ్యూరో, కరీంనగర్: కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో ఓ శిశువు చేతులు, కాళ్లకు ఆరు వేళ్లతో జన్మించాడు.
ఇటువంటివి అరుదుగా జరుగుతాయని, వంశ పారంపర్యంగా కూడా ఇలా జరిగేందుకు వీలుంటుందని వైద్యులు అంటున్నారు.
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఎరుగట్ల గ్రామానికి చెందిన రవళి పురిటి నొప్పులతో బాధ పడుతుండగా తొలుత మెట్టుపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లారు.
అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. స్థానిక వైద్యులు నార్మల్ డెలివరీ ద్వారా కాన్పు జరిగేలా చూశారు.
తొలి కాన్పులో మగ బిడ్డ జన్మించినా, చేతులు, కాళ్లకు ఆరేసి వేళ్ళు ఉండడంతో తల్లిదండ్రులు సాగర్, రవళి ఆందోళనకు గురయ్యారు.
పసికందు 24 వేళ్ళతో జన్మించినప్పటికీ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి కేసుల్లో పిల్లలకు హార్ట్ లో హోల్స్ ఉండే అవకాశం కూడా ఉంటుందన్నారు.