Kavya Kalyanram | కావ్య కళ్యాణ్ రామ్: అల్లు అర్జున్‌తో చేయను! ఫ్యాన్స్ హర్టయ్యే లోపు.. భలే క్లారిటీ ఇచ్చేసింది

Kavya Kalyanram | ఓ హీరో పక్కన బాలనటిగా సినిమాల్లో నటించి హీరోయిన్ అవడం, మళ్ళీ అదే హీరో సరసన హీరోయిన్‌గా చేయడం అనేది ఎప్పటినుంచో వస్తున్నదే.. ఇలాంటి బాల నటుల గురించి చెప్పాలంటే ముందుగా శ్రీదేవి గురించే చెప్పాలి. నందమూరి తారకరామారావుతో మనవరాలిగా చేసిన శ్రీదేవి మళ్ళీ ఆయన సరసన చాలా ఏజ్ గ్యాప్ ఉన్నా ‘వేటగాడు’ లాంటి సినిమాలో నటించి సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత నుంచి వీళ్ళ ఇద్దరి కాంబినేషన్‌కి మంచి […]

  • Publish Date - August 24, 2023 / 02:05 PM IST

Kavya Kalyanram |

ఓ హీరో పక్కన బాలనటిగా సినిమాల్లో నటించి హీరోయిన్ అవడం, మళ్ళీ అదే హీరో సరసన హీరోయిన్‌గా చేయడం అనేది ఎప్పటినుంచో వస్తున్నదే.. ఇలాంటి బాల నటుల గురించి చెప్పాలంటే ముందుగా శ్రీదేవి గురించే చెప్పాలి. నందమూరి తారకరామారావుతో మనవరాలిగా చేసిన శ్రీదేవి మళ్ళీ ఆయన సరసన చాలా ఏజ్ గ్యాప్ ఉన్నా ‘వేటగాడు’ లాంటి సినిమాలో నటించి సూపర్ హిట్ కొట్టింది.

ఆ తర్వాత నుంచి వీళ్ళ ఇద్దరి కాంబినేషన్‌కి మంచి క్రేజ్ ఉండేది. అలాగే బాల నటులు ఏజ్ గ్యాప్ చూసుకోకుండా పెద్ద హీరోలతో నటించడం మామూలే.. అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం అవకాశం రాగానే అందిపుచ్చుకోవడం కూడా మామూలే.

‘బలగం’ సినిమాతో హిట్ కొట్టిన హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ ఒకప్పుడు బాలనటిగా సినీ తెరకు పరిచయం అయింది. చిరంజీవి లాంటి స్టార్ హీరో పక్కన కూడా నటించింది. అలాగే అప్పట్లో వచ్చిన ‘గంగోత్రి’ మూవీలో చిన్నప్పటి హీరోయిన్ పాత్రను పోషించింది. ‘బలగం, మసూద’ సినిమాలతో బాలనటి అనే ముద్రను చెరిపేసి తనలోని నటనను ఇప్పుడిప్పుడే బయట పెడుతుంది. ఈ సినిమాలు హిట్ కావడంతో కావ్యకు వరస సినిమా అవకాశాలు వస్తున్నాయి.

అలాగే సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్‌గా ఉంటుంది. వరుసగా హాట్ ఫోటో షూట్స్‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తూ రాబోయే కాలానికి స్టార్ హీరోయిన్ అవబోయే లక్షణాలతో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్‌తో హీరోయిన్ ఛాన్స్ వస్తే చేయనంటూ హాట్ హాట్ కామెంట్స్ చేసింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యే లోపు దీనిపై ఆమె క్లారిటీ కూడా ఇచ్చేసింది. అసలెందుకు ఆమె ఇలా అందంటే..

‘గంగోత్రి’ సమయంలో షూటింగ్‌‌లో చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళు చెప్పింది చేయించే వారట దర్శకులు. ఇక అల్లు అర్జున్ అయితే షూటింగ్ విరామంలో తనతో ఆడుకునేవాడట. అప్పుడే.. ‘పెద్దయ్యాక నాతో హీరోయిన్‌గా చేస్తావా?’ అని అల్లు అర్జున్ అడిగితే.. మీరు అప్పటికి ముసలివాళ్ళు అయిపోతారు కదా.. నేను నటించను అందట.

ఇదే సంగతి ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది కావ్య. అప్పుడేదో చిన్నతనంలో అన్నాను కానీ.. నేను హీరోయిన్ అయినా.. ఇంకా అల్లు అర్జున్ గారు మంచి రేంజ్‌లో పాన్ ఇండియా స్టార్‌గా దూసుకెళుతూనే ఉన్నారని చెప్పుకొచ్చింది. అప్పుడలా అంది కానీ.. ఇప్పుడు నిజంగా అవకాశం వస్తే.. ఎగిరి గంతేయదీ పొట్టి పిల్ల.

Latest News