Kerala | అంబులెన్స్‌ను ఢీ కొట్టిన మంత్రి ఎస్కార్ట్ వాహ‌నం.. ముగ్గురికి గాయాలు

Kerala | అంబులెన్స్ బోల్తా.. ఆపకుండా వెళ్లిపోయిన మంత్రి అంబులెన్స్ డ్రైవర్ మీద కేసు పెట్టిన పోలీసులు కేర‌ళ‌లోని కొల్లాం జిల్లాలోని జంక్ష‌న్‌లో ఘ‌ట‌న‌ విధాత‌: కేర‌ళ విద్యాశాఖ మంత్రి శ‌వ‌న్‌కుట్టి ఎస్కార్ట్ వాహ‌నం శుక్ర‌వారం ఓ అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌నలో అంబులెన్స్‌లో ఉన్న పేషంట్‌తోపాటు ముగ్గురికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం ఉద‌యం కొల్లాం జిల్లా కొట్ట‌ర‌క్క‌రలో ఉన్న పుల్‌మాన్ జంక్ష‌న్‌లో జ‌రిగింది. Kerala - Education Minister Shivan Kutty's escort […]

Kerala | అంబులెన్స్‌ను ఢీ కొట్టిన మంత్రి ఎస్కార్ట్ వాహ‌నం.. ముగ్గురికి గాయాలు

Kerala |

  • అంబులెన్స్ బోల్తా.. ఆపకుండా వెళ్లిపోయిన మంత్రి
  • అంబులెన్స్ డ్రైవర్ మీద కేసు పెట్టిన పోలీసులు
  • కేర‌ళ‌లోని కొల్లాం జిల్లాలోని జంక్ష‌న్‌లో ఘ‌ట‌న‌

విధాత‌: కేర‌ళ విద్యాశాఖ మంత్రి శ‌వ‌న్‌కుట్టి ఎస్కార్ట్ వాహ‌నం శుక్ర‌వారం ఓ అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌నలో అంబులెన్స్‌లో ఉన్న పేషంట్‌తోపాటు ముగ్గురికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం ఉద‌యం కొల్లాం జిల్లా కొట్ట‌ర‌క్క‌రలో ఉన్న పుల్‌మాన్ జంక్ష‌న్‌లో జ‌రిగింది.

పుల్‌మాన్ జంక్ష‌న్ మీదుగా మంత్రి కాన్వ‌య్ వెళ్తున్న సంద‌ర్భంలో అన్ని వైపులా నుంచి పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఒక మార్గం నుంచి అంబులెన్స్ ఒక్క‌సారిగా ముందుకు దూసుకొచ్చింది. మ‌రో మార్గం నుంచి వేగంగా వ‌స్తున్న మంత్రి ఎస్కార్ట్ వాహ‌నం అంబులెన్స్‌ను బ‌లంగా ఢీ కొట్ట‌డంతో అది బోల్తా ప‌డి ఫ‌ల్టీలు కొట్టింది.

ఈ ప్ర‌మాదంలో పేషంట్‌తోపాటు ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఎస్కార్ట్ వాహ‌నం రోడ్డుపై ఉన్న‌బైక్‌ను కూడా ఢీకొట్టింది. ప్ర‌మాదం త‌ర్వాత‌ మంత్రి దూరంగా కాసేపు ఆగి, త‌ర్వాత వెళ్లిపోయారు. ఈ ఘ‌ట‌న‌లో అంబులెన్స్ డ్రైవ‌ర్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. పోలీస్ ఎస్కార్ట్ వాహ‌నంపై ఎలాంటి కేసు న‌మోదు కాలేదు. రోడ్డు ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది