Khairatabad Ganesh | ఖైరతాబాద్ వినాయక విగ్రహానికి అంకురార్పణ.. ఈ ఏడాది ఎన్ని అడుగులంటే..?
Khairatabad Ganesh | వినాయక చవితి అనగానే రాజధాని ప్రజలకు గానీ, ఇతరులకు గానీ ఖైరతాబాద్ గణేష్. ఖైరతాబాద్‌లో కొలువుదీరే గణనాథుడి దర్శనం కోసం రాష్ట్ర రాజధాని ప్రజలే కాదు.. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అంతటి ప్రత్యేకత కలిగిన ఖైరతాబాద్ గణేష్ విగ్రహా నిర్మాణానికి మే 31వ తేదీన అంకురార్పణ జరిగింది. బుధవారం నిర్జల ఏకాదశిని పురస్కరించుకుని ఖైరతాబాద్ మహా గణపతి ఏర్పాటు కోసం కర్రపూజను […]
Khairatabad Ganesh | వినాయక చవితి అనగానే రాజధాని ప్రజలకు గానీ, ఇతరులకు గానీ ఖైరతాబాద్ గణేష్. ఖైరతాబాద్‌లో కొలువుదీరే గణనాథుడి దర్శనం కోసం రాష్ట్ర రాజధాని ప్రజలే కాదు.. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు.
అంతటి ప్రత్యేకత కలిగిన ఖైరతాబాద్ గణేష్ విగ్రహా నిర్మాణానికి మే 31వ తేదీన అంకురార్పణ జరిగింది. బుధవారం నిర్జల ఏకాదశిని పురస్కరించుకుని ఖైరతాబాద్ మహా గణపతి ఏర్పాటు కోసం కర్రపూజను సాయంత్రం 5 గంటలకు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించింది.
ఈ పూజతో గణనాథుడి విగ్రహ నిర్మాణ పని ప్రారంభమైంది. అయితే ఈ ఏడాది 51 అడుగుల ఎత్తులో మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇక వచ్చే వారం గణనాథుడికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది.
గత ఏడాది పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. ఎడమవైపున శ్రీ తిశక్తి మహా గాయత్రి దేవి, కుడి వైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. గత ఏడాది 50 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఖైరతాబాద్ గణేషుడిని గత ఏడాది తొలిసారి మట్టితో రూపొందించారు. ఈ సారి కూడా మట్టి విగ్రహమే ఏర్పాటు చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram