Kushi | మొదటి ఆప్షన్ సమంత కాదట.. నిజంగా ఆ హీరోయిన్ చేసి ఉంటేనా.. నా సామిరంగా..!

Kushi | సినిమా స్క్రీన్ మీద కొన్ని జంటలు జనాలకు అలవాటైపోతాయి, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఇట్టే పండుతుంది. ఇక స్క్రిప్ట్ పరంగా పెద్దగా శ్రమపడక్కరలేకుండానే తెర మీద సహజమైన నటనను ప్రదర్శిస్తారు నటీనటులు. ఇలా పెయిర్ కరెక్ట్‌గా సెట్ అయ్యి.. హిట్ పెయిర్‌గా నిలిచిన జంటలు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా మన తెలుగులో అయితే.. ఎన్టీఆర్-సావిత్రి, వెంకటేష్- సౌందర్య, ప్రభాస్-అనుష్క.. ఇలా వీళ్ళ కాంబినేషన్ తెరకు ప్రత్యేకమైన అందాన్ని తెస్తుందని ప్రేక్షకులు సంబరపడతారు. అయితే ఈమధ్య […]

  • Publish Date - September 4, 2023 / 11:16 AM IST

Kushi |

సినిమా స్క్రీన్ మీద కొన్ని జంటలు జనాలకు అలవాటైపోతాయి, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఇట్టే పండుతుంది. ఇక స్క్రిప్ట్ పరంగా పెద్దగా శ్రమపడక్కరలేకుండానే తెర మీద సహజమైన నటనను ప్రదర్శిస్తారు నటీనటులు. ఇలా పెయిర్ కరెక్ట్‌గా సెట్ అయ్యి.. హిట్ పెయిర్‌గా నిలిచిన జంటలు ఎందరో ఉన్నారు.

ముఖ్యంగా మన తెలుగులో అయితే.. ఎన్టీఆర్-సావిత్రి, వెంకటేష్- సౌందర్య, ప్రభాస్-అనుష్క.. ఇలా వీళ్ళ కాంబినేషన్ తెరకు ప్రత్యేకమైన అందాన్ని తెస్తుందని ప్రేక్షకులు సంబరపడతారు. అయితే ఈమధ్య కాలంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కాంబినేషన్ కూడా దాదాపు అలాంటి టాక్‌నే సొంతం చేసుకుంది. ఈ ఇద్దరూ ఇప్పటి వరకూ చేసిన సినిమాలు వారి కెమిస్ట్రీని తెలియజేశాయి.

ఇప్పటికే రెండు మూడు సినిమాలలో కనిపించిన ఈ జంట.. మరోసారి కనిపించబోయి కొద్దిలో తప్పిపోయిందట. సెప్టెంబర్ ఒకటిన విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన ‘ఖుషి’ మూవీ రిలీజ్ అయింది. ఇందులో విజయ్ దేవరకొండ, సమంతల రొమాన్స్ హాట్ టాపిక్ అయింది.

నిజానికి ఈ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ మొదట హీరోయిన్‌గా రష్మిక మందన్నా ఉంటే బావుంటుందని అనుకున్నాడట. అయితే రష్మిక, విజయ్‌లను తెరమీద చాలాసార్లు చూసి ఉండటంతో మళ్ళీ రిపీట్ అయితే కథలో కిక్ ఉండదనే రీజన్ తో సమంతను తీసుకున్నారనేలా టాక్ వినబడుతుంది.

సమంతను మూవీలో ఉంచితే హైప్ వస్తుందని, ఆమెకు డైవర్స్ కావడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కారణంగా ఇది సినిమాకు ఫ్లస్ అవుతుందని దర్శకుడు ఆలోచించాడట. అందుకని రష్మిక ఫ్లేస్‌లోకి సమంత వచ్చిందని అంటున్నారు. అంతేకాదు.. రష్మిక మేనేజర్ చేసిన మోసం కూడా ఇందుకు కారణం అనేలా మరోవైపు టాక్ వినబడుతుంది.

ఇక ఖుషి మూవీ అటు సమంతకు, ఇటు విజయ్ దేవరకొండకు ఇద్దరికీ హిట్ ఇచ్చి.. కలెక్షన్స్ పరంగానూ దూసుకెళుతోంది. ఈ సినిమా విడుదలకు ముందు హిట్ కొట్టకపోతే అనే ప్రశ్న ఇద్దరిలోనూ ఉంది. లైగర్ అట్టర్ ఫ్లాప్ తర్వాత, హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నాడు హీరో విజయ్ దేవరకొండ.

ఇక సమంత పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. ఈమెకు కూడా ‘శాకుంతలం’ ఫ్లాప్ తర్వాత సరైన హిట్ పడలేదు. ఇద్దరికీ ‘ఖుషి’ గట్టెక్కించే రూట్ అయింది. అయితే దర్శకుడు అనుకున్నట్టుగానే మూవీలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరింది.

‘ఖుషి’ కాస్త తెలిసిన కథే అయినా.. మిస్టేక్స్ పెద్దగా లేకపోవడంతో.. ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులని ఆకర్షిస్తోంది. అయితే కొన్ని సీన్లలో మాత్రం సమంత తేలిపోయిందనే చెప్పాలి. ఆ సీన్స్‌లో రష్మిక అయితే.. సీన్స్ ఇంకా బాగా పండేవి అని.. సినిమా చూసిన కొందరు అనుకుంటుండటం విశేషం.

Latest News