Vijay Deverakonda | నిజంగా.. విజయ్ దేవరకొండను తొక్కేయాలని చూస్తున్నారా? లేకపోతే ఇదేంటి?
Vijay Deverakonda | విధాత: రౌడీ హీరో విజయ్ దేవరకొండని తెలుగు సినిమా ఇండస్ట్రీలో తొక్కేయాలని చూస్తున్నారా? అంటే.. అవుననే చెప్పాలి. గతంలో కూడా ఒకసారి ఈ టాపిక్ వచ్చింది. ‘అర్జున్ రెడ్డి’, ‘గీతా గోవిందం’ తర్వాత విజయ్ క్రేజ్ అమాంతం పెరిగినా.. ఆ తర్వాత సరైన సినిమా ఆయన నుంచి రాలేదు. దీంతో కాస్త డౌన్ అయ్యాడు. ఇక పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘లైగర్’ సినిమా అయితే విజయ్ దేవరకొండని మరింతగా డౌన్ చేసేసింది. […]
Vijay Deverakonda |
విధాత: రౌడీ హీరో విజయ్ దేవరకొండని తెలుగు సినిమా ఇండస్ట్రీలో తొక్కేయాలని చూస్తున్నారా? అంటే.. అవుననే చెప్పాలి. గతంలో కూడా ఒకసారి ఈ టాపిక్ వచ్చింది. ‘అర్జున్ రెడ్డి’, ‘గీతా గోవిందం’ తర్వాత విజయ్ క్రేజ్ అమాంతం పెరిగినా.. ఆ తర్వాత సరైన సినిమా ఆయన నుంచి రాలేదు. దీంతో కాస్త డౌన్ అయ్యాడు. ఇక పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘లైగర్’ సినిమా అయితే విజయ్ దేవరకొండని మరింతగా డౌన్ చేసేసింది.
పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ సినిమా తొలి ఆట నుంచే అట్టర్ ఫ్లాప్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమా పరాజయం దెబ్బకి మళ్లీ బయటికి రావడానికి విజయ్‌కి చాలా కాలమే పట్టింది. ఇప్పుడు ‘ఖుషి’తో మంచి హిట్ అందుకున్నాడని సంతోషించే లోపు.. ఏదో ఒక కారణంతో విజయ్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అందుకు ఉదాహరణ.. తాజాగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ వారు చేసిన ట్వీటే.
‘లైగర్’ ఫ్లాప్ తర్వాత విజయ్‌కి ధైర్యాన్ని ఇచ్చింది ఆయన అభిమానులే. సక్సెస్, ఫ్లాప్స్ సహజం అంటూ.. విజయ్‌ని, ఆయన క్రేజ్‌ని పడిపోనివ్వకుండా ఫ్యాన్స్ అండగా నిలబడ్డారు. అలాంటి వారందరినీ తన ఫ్యామిలీగా చేర్చుకున్న విజయ్ దేవరకొండ.. వారి కోసం ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు.
ముఖ్యంగా క్రిస్టమస్ టైమ్‌లో దేవర శాంటా అంటూ తన అభిమానులకు గిఫ్ట్స్ పంపిస్తుంటాడు. అవసరంలో ఉన్న వారికి ధన సాయం చేస్తుంటాడు. కొన్ని ఫ్యామిలీలను సెలక్ట్ చేసి తన సొంత డబ్బులతో వారిని టూర్ పంపిస్తుంటాడు.
ఇలా విజయ్ కూడా ఫ్యాన్స్ పట్ల తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాడు. ఇప్పుడు కూడా ‘ఖుషి’ ఆనందంలో ఉన్న విజయ్ ఓ 100 ఫ్యామిలీలకు ఒక్కో ఫ్యామిలీకి రూ. లక్ష చొప్పున కోటి రూపాయలు ఇస్తానని మాటిచ్చాడు. ఇచ్చినట్లుగానే ఆ ప్రాసెస్‌ను స్టార్ట్ చేశాడు.
Devara Family
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram