ఎల్ఐసీ షేర్‌కూ అదానీ సెగ‌

-రికార్డు స్థాయికి ప‌త‌న‌మైన విలువ‌ విధాత‌: దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో అదానీ గ్రూప్ (ADANI GROUP) న‌ష్టాలు.. ప్ర‌భుత్వ రంగ బీమా దిగ్గ‌జం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ (LIC) షేర్ల‌నూ తాకుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌ (BSE)లో మునుపెన్న‌డూ లేనివిధంగా ఎల్ఐసీ షేర్ విలువ రూ.566కు దిగ‌జారింది. నిరుడు మే నెల‌లో స్టాక్ మార్కెట్ల‌లో లిస్టింగ్ జ‌రిగిన స‌మ‌యంలో ఎల్ఐసీ షేర్ విలువ రూ.949గా ఉన్నది. దీంతో 40 శాతం ప‌డిపోయిన‌ట్టైంది. అస‌లే ఎల్ఐసీ షేర్ల‌కు మార్కెట్‌లో […]

ఎల్ఐసీ షేర్‌కూ అదానీ సెగ‌

-రికార్డు స్థాయికి ప‌త‌న‌మైన విలువ‌

విధాత‌: దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో అదానీ గ్రూప్ (ADANI GROUP) న‌ష్టాలు.. ప్ర‌భుత్వ రంగ బీమా దిగ్గ‌జం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ (LIC) షేర్ల‌నూ తాకుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌ (BSE)లో మునుపెన్న‌డూ లేనివిధంగా ఎల్ఐసీ షేర్ విలువ రూ.566కు దిగ‌జారింది.

నిరుడు మే నెల‌లో స్టాక్ మార్కెట్ల‌లో లిస్టింగ్ జ‌రిగిన స‌మ‌యంలో ఎల్ఐసీ షేర్ విలువ రూ.949గా ఉన్నది. దీంతో 40 శాతం ప‌డిపోయిన‌ట్టైంది. అస‌లే ఎల్ఐసీ షేర్ల‌కు మార్కెట్‌లో ఆద‌ర‌ణ అంతంత‌మాత్రంగానే ఉన్న నేప‌థ్యంలో అదానీ వ్య‌వ‌హారం.. మ‌దుప‌రుల‌ను ఇంకా దూరం చేస్తున్న‌ది.

ఇక అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బ‌ర్గ్ (HINDENBURG) గ‌త నెల 24న ఇచ్చిన రిపోర్టుతో అదానీ కంపెనీల షేర్లు భారీగా ప‌త‌న‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. దీంతో వీటిని కొన్న ఎల్ఐసీపైనా ఆ ప్ర‌భావం క‌నిపిస్తున్న‌ది. ఫ‌లితంగా ఎల్ఐసీ షేర్ల‌నూ కొనేందుకు మ‌దుప‌రులు జంకుతున్నారు.

ఈ ప్ర‌భుత్వ రంగ బీమా సంస్థ.. మొత్తం అదానీ గ్రూప్‌లోని ఏడు కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్టింది. అయితే ఒకానొక ద‌శ‌లో ఈ పెట్టుబ‌డుల విలువ గ‌రిష్ఠంగా రూ.53,000 కోట్లుగా ఉంటే.. ఇప్పుడు రూ.25,000 కోట్ల స్థాయిలోనే ఉండ‌టం గ‌మ‌నార్హం.

నిజానికి అదానీ గ్రూప్ సంస్థ‌ల్లో ఎల్ఐసీ పెట్టిన ఈక్విటీ పెట్టుబ‌డుల విలువే రూ.30,127 కోట్లు. కానీ దీని కంటే కూడా ఇప్పుడు త‌గ్గిపోవ‌డం ఎల్ఐసీని క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తున్న‌ది. అస‌లుతో లెక్కించినా రూ.5,000 కోట్ల సంప‌ద ఆవిరైపోయిందని గ‌ణాంకాలు చెప్తున్నాయి.