Viral Video | గుజరాత్ వీధుల్లో మృగరాజుల రాజసం
Viral Video | అడవికి రారాజు మృగరాజు సింహం( Lion ). అలాంటి సింహాన్ని చూస్తే మిగతా జంతువులకే కాదు.. మనషులు కూడా భయపడుతారు. అవి ఒక్కసారి గర్జించాయంటే చాలు.. శరీరమంతా చెమటలు పట్టేస్తాయి. మరి అంతటి భయంకరమైన సింహాలు.. అడవి నుంచి గ్రామాల బాట పడితే.. గుండెల్లో దడ పుట్టాల్సిందే. గుజరాత్ ( Gujarat ) వీధుల్లో మృగరాజులు తిరుగుతూ స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేశాయి. ఓ ఎనిమిది సింహాలు.. గ్రామాల్లోకి ప్రవేశించి సంచరిస్తున్న […]
Viral Video | అడవికి రారాజు మృగరాజు సింహం( Lion ). అలాంటి సింహాన్ని చూస్తే మిగతా జంతువులకే కాదు.. మనషులు కూడా భయపడుతారు. అవి ఒక్కసారి గర్జించాయంటే చాలు.. శరీరమంతా చెమటలు పట్టేస్తాయి. మరి అంతటి భయంకరమైన సింహాలు.. అడవి నుంచి గ్రామాల బాట పడితే.. గుండెల్లో దడ పుట్టాల్సిందే. గుజరాత్ ( Gujarat ) వీధుల్లో మృగరాజులు తిరుగుతూ స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేశాయి.
ఓ ఎనిమిది సింహాలు.. గ్రామాల్లోకి ప్రవేశించి సంచరిస్తున్న ఓ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద( Susanta Nanda ) తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అయితే సింహాలు సంచరించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే వాహనాల లైట్లకు సింహాలు ఆందోళనకు గురై వచ్చిన దారిలో వెనుదిరిగిన దృశ్యాలు ఆ ఫుటేజీలో కనిపించాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram