బైక్‌ను ఎత్తుకొని బ‌స్సు పైకెక్కిన కూలీ.. వీడియో వైర‌ల్

Viral Video | విధాత: రెక్కాడితే కానీ డొక్కాడ‌ని ప‌రిస్థితి కూలీల‌ది. ప్ర‌తి రోజు ప‌ని చేస్తేనే వారి క‌డుపు నిండుతోంది. లేదంటే ఆక‌లితో అల‌మ‌టించి పోతారు. అలా జీవిత ప్ర‌యాణంలో క‌డుపు నింపుకునేందుకు ఎన్నో ప‌నులు చేస్తుంటారు. అంతే కాదండోయ్ సాహసాలు కూడా చేస్తుంటారు. ఓ కూలీ కూడా త‌న ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి సాహ‌సం చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. బైక్‌ను ఎత్తుకొని బ‌స్సు పైకెక్కిన కూలీ https://t.co/05kvmVK8o7 […]

బైక్‌ను ఎత్తుకొని బ‌స్సు పైకెక్కిన కూలీ.. వీడియో వైర‌ల్

Viral Video | విధాత: రెక్కాడితే కానీ డొక్కాడ‌ని ప‌రిస్థితి కూలీల‌ది. ప్ర‌తి రోజు ప‌ని చేస్తేనే వారి క‌డుపు నిండుతోంది. లేదంటే ఆక‌లితో అల‌మ‌టించి పోతారు. అలా జీవిత ప్ర‌యాణంలో క‌డుపు నింపుకునేందుకు ఎన్నో ప‌నులు చేస్తుంటారు. అంతే కాదండోయ్ సాహసాలు కూడా చేస్తుంటారు. ఓ కూలీ కూడా త‌న ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి సాహ‌సం చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

జార్ఖండ్‌లోని ఓ బ‌స్టాండ్‌లో పని చేసే ఓ కూలీ.. త‌న నెత్తిపై బెక్‌ను పెట్టుకుని బ‌స్సుకు ఉన్న ఇనుప నిచ్చెన సాయంతో.. బస్సు పైకి ఎక్కి.. బండిని అక్కడ పెట్టేశాడు. ఇదంతా బుక్కెడు బువ్వ కోస‌మే అని చెప్ప‌క త‌ప్ప‌దు.

నెట్టింట వైర‌ల్ అవుతున్న ఈ వీడియోను చూసి ది రియ‌ల్ బాహుబ‌లి, సూప‌ర్ మ్యాన్ అని నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అత‌ని ధైర్యానికి మెచ్చుకోవాల్సిందేనని కొనియాడుతున్నారు.