Viral Video | సీఎం ప్ర‌సంగిస్తుండ‌గా.. వేదిక వైపు దూసుకొచ్చిన యువ‌కుడు

Viral Video | బీహార్ రాజ‌ధాని పాట్నాలోని గాంధీ మైదానంలో నిర్వ‌హించిన 77వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో ఊహించ‌ని ప‌రిమాణం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తుండ‌గా.. వేదిక వైపు ఓ యువ‌కుడు దూసుకొచ్చాడు. అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తా సిబ్బంది.. ఆ యువ‌కుడిని అడ్డుకుని, పోలీసుల‌కు అప్ప‌గించారు. త‌న‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం ఇవ్వాల‌ని ఆ యువ‌కుడు పోస్ట‌ర్ ప్ర‌ద‌ర్శించాడు. యువ‌కుడిని పోలీసులు విచారించారు. తాను ముంగేర్ జిల్లాకు చెందిన నితీశ్ కుమార్‌(26)న‌ని […]

  • By: raj    latest    Aug 15, 2023 1:27 PM IST
Viral Video | సీఎం ప్ర‌సంగిస్తుండ‌గా.. వేదిక వైపు దూసుకొచ్చిన యువ‌కుడు

Viral Video | బీహార్ రాజ‌ధాని పాట్నాలోని గాంధీ మైదానంలో నిర్వ‌హించిన 77వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో ఊహించ‌ని ప‌రిమాణం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తుండ‌గా.. వేదిక వైపు ఓ యువ‌కుడు దూసుకొచ్చాడు. అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తా సిబ్బంది.. ఆ యువ‌కుడిని అడ్డుకుని, పోలీసుల‌కు అప్ప‌గించారు. త‌న‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం ఇవ్వాల‌ని ఆ యువ‌కుడు పోస్ట‌ర్ ప్ర‌ద‌ర్శించాడు.

యువ‌కుడిని పోలీసులు విచారించారు. తాను ముంగేర్ జిల్లాకు చెందిన నితీశ్ కుమార్‌(26)న‌ని తెలిపాడు. త‌న తండ్రి రాజేశ్వ‌ర్ పాశ్వాన్ బీహార్ మిలిట‌రీ పోలీసు విభాగంలో ప‌ని చేస్తూ.. విధి నిర్వ‌హ‌ణ‌లోనే కొన్నేండ్ల క్రితం చ‌నిపోయాడ‌ని పేర్కొన్నాడు. ఈ క్ర‌మంలో తాను ప్ర‌భుత్వ ఉద్యోగానికి అర్హుడిన‌ని, కారుణ్య నియామ‌కం కింద ఉద్యోగం క‌ల్పించాల‌ని సీఎంను కోరేందుకు ఇక్క‌డ‌కు వ‌చ్చాన‌ని నితీశ్ తెలిపాడు. ఈ ఘ‌ట‌న‌పై ఉన్న‌త స్థాయి ద‌ర్యాప్తున‌కు ఆదేశించిన‌ట్లు పాట్నా జిల్లా క‌లెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ సింగ్ పేర్కొన్నారు.