Plum Farming | కాసులు కురిపిస్తున్న ‘రేగు’ కాయలు.. రూ. లక్ష పెట్టుబడితో రూ. 6 లక్షల సంపాదించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
Plum Farming | ఇంజినీర్లు అందరూ వ్యవసాయం( agriculture ) బాట పడుతున్నారు. గతంలో కేవలం రైతులు( Farmers ), వారి పిల్లలు మాత్రమే వ్యవసాయం చేసేవారు. ఇటీవలి కాలంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు( Software Engineers ) సైతం సాగుపై దృష్టి సారిస్తున్నారు. విదేశాల్లో మంచి ఉద్యోగం వదిలేసిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. తన సొంతూరిలో రేగు కాయలు( Plum Farming ) పండిస్తూ లక్షల రూపాయాలు సంపాదిస్తున్నాడు. ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గురించి తెలుసుకోవాలంటే బీహార్( Bihar ) వెళ్లాల్సిందే.
Plum Farming | బీహార్( Bihar )లోని నలంద జిల్లా హుస్సేనా గ్రామానికి చెందిన అమేశ్ విశాల్( Amesh Vishal ) కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆయనకు విదేశాల్లో మంచి ఉద్యోగం వచ్చింది. కానీ ఆ ఉద్యోగంలో సంతృప్తి లభించలేదు. వ్యవసాయ చేయాలనే ఆలోచన ఉండడంతో సొంతూరికి తిరిగి వచ్చాడు. భారీ వేతనంతో కూడిన ఉద్యోగాన్ని వదిలేసినప్పటికీ.. రేగు కాయల సాగు( Plum Farming ) చేస్తూ అతి స్వల్ప కాలంలోనే, తక్కువ పెట్టుబడితో లాభాలు గడిస్తున్నాడు.
ఇక వ్యవసాయం చేయాలనుకున్న అమేశ్.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు ఏవి..? దీర్ఘకాలంలో కలిసొచ్చే ఉద్యాన పంట( Horticulture ) ఏది..? అనే విషయాలపై సుదీర్ఘంగా పరిశోధన చేశాడు. చివరకు రైతులతో( Farmers ) కూడా చర్చలు జరిపాడు. దాదాపు ఏడాది కాలం పరిశోధన చేసిన తర్వాత.. రేగు కాయల సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఎకరా పొలంలో మూడు రకాలు సాగు..

ప్రస్తుతం గ్రీన్ యాపిల్ ప్లం, కశ్మీరీ యాపిల్ ప్లం, బాల సుందరి రకాల రేగుపండ్లకు మార్కెట్‌లో డిమాండ్ ఉంది. దీంతో వాటినే సాగు చేయాలని ఆయన సంకల్పించాడు. కానీ ఈ మూడు రకాల విత్తనాలు మన దేశంలో లభించవు. థాయ్‌లాండ్‌లో సాగు అవుతుంటాయి. ఎట్టకేలకు పశ్చిమ బెంగాల్‌లోని ఓ నర్సరీ నుంచి గ్రీన్ యాపిల్ ప్లం, కశ్మీరీ యాపిల్ ప్లం, బాల సుందరి రేగు పండ్ల విత్తనాలను సేకరించాడు. ఇక ఆ విత్తనాలను తీసుకొచ్చి 2023లో ఎకరా పొలంలో సాగు చేశాడు.
రూ. లక్ష పెట్టుబడి.. ఒక్కో చెట్టు నుంచి 50 కిలోల పండ్లు..

ఈ సాగుకు లక్ష రూపాయాలు పెట్టుబడి పెట్టాడు. ఇక మూడు రకాలు కలుపుకొని దాదాపు 350కిపైగా రేగు చెట్లు సాగు చేశాడు. వీటిని నాటడానికి, ఎరువులకు ప్రారంభ పెట్టుబడిగా దాదాపు రూ.లక్షను ఖర్చు పెట్టారు. ఇందుకు ప్రతిఫలంగా గత రెండు పంట సీజన్లలో కలుపుకొని రూ.6 లక్షల దాకా ఆయన సంపాదించాడు. అమేశ్ పొలంలోని రేగు చెట్లు విరివిగా కాస్తున్నాయి. ఒక్కో చెట్టు నుంచి 50 కేజీల పండ్లు లభిస్తున్నాయి. దీంతో కేవలం రెండు సీజన్లలోనే రూ. 6 లక్షలు సంపాదించి, పలువురికి మార్గదర్శకంగా నిలిచాడు.
జనవరిలో రేగు పండ్లకు ఫుల్ డిమాండ్
పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, అసోం, త్రిపుర సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో జనవరి నెలలో రేగు పండ్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే జనవరి చివరి వారంలో ప్రతి ఇంటా సరస్వతీ పూజను నిర్వహిస్తారు. ఈ పూజలో భాగంగా అమ్మవారికి రేగు పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ క్రమంలో ఆ రాష్ట్రాల్లో రేగు పండ్లను విరివిగా కొంటారు. ధరను కూడా లెక్క చేయరు. కేజీ రేగు పండ్లను రూ. 70 నుంచి రూ. 90 మధ్య విక్రయిస్తాడు అమేశ్.
రేగు తోటను విస్తరిస్తా : అమేశ్
లాభాల బాటలో దూసుకుపోతున్న అమేశ్ విశాల్ తన రేగు తోట సాగును విస్తరించేందుకు యత్నిస్తున్నాడు. మొదట పెట్టుబడి పెట్టింది రూ. లక్షనే. కానీ రెండు సీజన్లలోనే రూ. 6 లక్షల ఆదాయం సమకూరింది. దీంతో రేగు తోట విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించుకున్నట్టు అమేశ్ తెలిపాడు. అయితే ఉద్యాన పంటల సాగులో మనం సక్సెస్ కావాలంటే సరైన పంట రకాన్ని ఎంపిక చేసుకోవాలని అమేశ్ తెలిపాడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram