Minister Jagadish Reddy | కేసీఆర్ దెబ్బకు ప్రతిపక్షాలు కకావికలం: మంత్రి జగదీశ్ రెడ్డి

మూడోసారి వచ్చేది కేసీఆరే…. గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమే! మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి Minister Jagadish Reddy | విధాత, సూర్యాపేట: అభ్యర్థుల ప్రకటనను క్యాష్ చేసుకోవాలని ఆశపడిన ప్రతిపక్షాల ఆశలు అడియాశలయ్యాయని, కేసీఆర్ దెబ్బకు ప్రతిపక్షాలు కకావికలం అయ్యాయని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట ఎమ్మెల్యే కిషోర్ తో కలిసి మీడియాతో మాట్లాడిన మంత్రి, మూడోసారి వచ్చేది కేసీఆరే…. గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. […]

  • By: Somu    latest    Aug 23, 2023 10:59 AM IST
Minister Jagadish Reddy | కేసీఆర్ దెబ్బకు ప్రతిపక్షాలు కకావికలం: మంత్రి జగదీశ్ రెడ్డి
  • మూడోసారి వచ్చేది కేసీఆరే….
  • గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమే!
  • మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి

Minister Jagadish Reddy | విధాత, సూర్యాపేట: అభ్యర్థుల ప్రకటనను క్యాష్ చేసుకోవాలని ఆశపడిన ప్రతిపక్షాల ఆశలు అడియాశలయ్యాయని, కేసీఆర్ దెబ్బకు ప్రతిపక్షాలు కకావికలం అయ్యాయని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట ఎమ్మెల్యే కిషోర్ తో కలిసి మీడియాతో మాట్లాడిన మంత్రి, మూడోసారి వచ్చేది కేసీఆరే…. గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల కోసం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాకు సకలజనుల ఆమోదం ఉందన్నారు.

సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందనేది ప్రజల భావన అన్నారు. తిరిగి కేసీఆరే మూడోసారి సీఎం కావాలనేదే ప్రజల ఆకాంక్ష అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రతిపక్షం లేదన్న మంత్రి.. ప్రతిపక్షాలవి చిల్లర ప్రగల్భాలని, వారు చేసే వ్యాఖ్యలు అర్థరహితం, అవగాహనా రాహిత్యం అని ఆరోపించారు. 75 ఏళ్లుగా దేశాన్ని, రాష్ట్రాన్ని మోసం చేసింది కాంగ్రెస్, బీజేపీలే అన్న మంత్రి, వారు చేయలేని అభివృద్ధిని పదేళ్లలోనే కేసీఆర్ చేసి చూపించారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు 119 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ మహా అయితే 50 స్థానాల్లో పోటీ చేస్తుందన్న మంత్రి, ఉన్న మూడు నిలబెట్టుకోవడానికి బీజేపీ ఆపసోపాలు పడుతోందన్నారు. కోతలు కోస్తున్న నేతలు కేసీఆర్ కి వ్యతిరేకంగా పోటీ చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. రాజకీయ జీవితంలో కేసీఆర్ లా ఓడిపోకుండా గెలిచిన‌ మొగోడు కాంగ్రెస్, బీజేపీల్లో ఉన్నారా అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ టీమ్ నంబర్ వన్ అన్న మంత్రి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 కు 12 స్థానాలు గెలిచి కేసీఆర్ చేతిలో పెడతాం అన్నారు. వచ్చే ఎన్నికల కప్ ను గెలుచుకుని కేసీఆర్ కు గిఫ్ట్ ఇస్తాం అంటూ మంత్రి జగదీశ్ రెడ్డి చలొక్తు లు విసిరారు.