Hyderabad | ఎల్‌బీ న‌గ‌ర్ ఆర్‌హెచ్ఎస్ ఫ్లై ఓవ‌ర్ రెడీ.. నేడు ప్రారంభించ‌నున్న కేటీఆర్

Hyderabad | హైద‌రాబాద్ వాసుల‌కు ట్రాఫిక్ క‌ష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఫ్లై ఓవ‌ర్లు( Fly Overs ), అండ‌ర్ పాస్‌లు( Underpass ), లింక్ రోడ్ల‌( Link Roads )ను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు చోట్ల ఫ్లై ఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌లు పూర్త‌యి.. ప్రారంభం కావ‌డంతో.. ట్రాఫిక్ క‌ష్టాలు తొల‌గిపోయాయి. ఈ ప్రాజెక్టుల‌న్నీంటినీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఎస్ఆర్‌డీపీ( SRDP ) కింద పూర్త‌య్యాయి. ఈ ఎస్ఆర్‌డీపీ మ‌రో మైలు రాయిని చేరుకుంది. […]

Hyderabad | ఎల్‌బీ న‌గ‌ర్ ఆర్‌హెచ్ఎస్ ఫ్లై ఓవ‌ర్ రెడీ.. నేడు ప్రారంభించ‌నున్న కేటీఆర్

Hyderabad | హైద‌రాబాద్ వాసుల‌కు ట్రాఫిక్ క‌ష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఫ్లై ఓవ‌ర్లు( Fly Overs ), అండ‌ర్ పాస్‌లు( Underpass ), లింక్ రోడ్ల‌( Link Roads )ను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు చోట్ల ఫ్లై ఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌లు పూర్త‌యి.. ప్రారంభం కావ‌డంతో.. ట్రాఫిక్ క‌ష్టాలు తొల‌గిపోయాయి.

ఈ ప్రాజెక్టుల‌న్నీంటినీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఎస్ఆర్‌డీపీ( SRDP ) కింద పూర్త‌య్యాయి. ఈ ఎస్ఆర్‌డీపీ మ‌రో మైలు రాయిని చేరుకుంది. ఈ ప్రాజెక్టు కింద రూ. 32 కోట్ల‌తో చేప‌ట్టిన ఎల్‌బీ న‌గ‌ర్( LB Nagar ) ఆర్‌హెచ్ఎస్ ఫ్లై ఓవ‌ర్( RHS Flyover ) ప్రారంభానికి సిద్ధ‌మైంది. ఈ ఫ్లై ఓవ‌ర్‌ను మంత్రి కేటీఆర్( Minister KTR ) శ‌నివారం ప్రారంభించ‌నున్నారు.

ఎస్ఆర్‌డీపీలో 19వ ప్రాజెక్టు అయిన ఆర్‌హెచ్ఎస్ ఫ్లై ఓవ‌ర్‌ను 760 మీట‌ర్ల పొడ‌వు, 12 మీట‌ర్ల వెడ‌ల్పుతో నిర్మించారు. ఈ ఫ్లై ఓవ‌ర్ ప్రారంభంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్, ఖ‌మ్మం( Khammam ), న‌ల్ల‌గొండ( Nallagonda ) ఉమ్మ‌డి జిల్లాల నుంచి హైద‌రాబాద్‌( Hyderabad )కు వ‌చ్చే వాహ‌నాల‌కు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండ‌వు. హ‌య‌త్‌న‌గ‌ర్ మీదుగా ఎలాంటి ట్రాఫిక్ అంత‌రాయం లేకుండా వెళ్లొచ్చు.