యువకుడిని కత్తితో పొడిచి చంపిన చిన్నారులు.. ఎందుకంటే..?
విధాత: ఓ 30 ఏండ్ల యువకుడు మద్యానికి బానిస అయ్యాడు. తన ఇంటి పొరుగున ఉన్న చిన్నారులను కొట్టి వారితో పైసలను తీసుకునేవాడు. ఆ తర్వాత మద్యం తాగొచ్చి.. మళ్లీ వారిపైనే దాడి చేసేవాడు. దీంతో చిన్నారులు ఆ యువకుడిపై కక్ష పెంచుకుని, కత్తితో పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన పశ్చిమ ఢిల్లీలోని సుల్తాన్‌పురి ఏరియాలో బుధవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. సుల్తాన్‌పురి లేబర్ కాలనీకి చెందిన అజయ్(30) నిత్యం మద్యం […]

విధాత: ఓ 30 ఏండ్ల యువకుడు మద్యానికి బానిస అయ్యాడు. తన ఇంటి పొరుగున ఉన్న చిన్నారులను కొట్టి వారితో పైసలను తీసుకునేవాడు. ఆ తర్వాత మద్యం తాగొచ్చి.. మళ్లీ వారిపైనే దాడి చేసేవాడు. దీంతో చిన్నారులు ఆ యువకుడిపై కక్ష పెంచుకుని, కత్తితో పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన పశ్చిమ ఢిల్లీలోని సుల్తాన్‌పురి ఏరియాలో బుధవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
సుల్తాన్‌పురి లేబర్ కాలనీకి చెందిన అజయ్(30) నిత్యం మద్యం మత్తులో మునిగి తేలేవాడు. అయితే తన ఇంటి పక్కనున్న పిల్లలతో పైసలు అడుక్కునేవాడు. మద్యం తాగొచ్చి ఆ పిల్లలను కొడుతూ, హింసించేవాడు. దీంతో ఓ ముగ్గురు చిన్నారులు యువకుడిని టార్గెట్ చేశారు. ఇక బుధవారం రాత్రి మద్యం మత్తులో ఉన్న అజయ్‌పై ఆ ముగ్గురు కలిసి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
అప్రమత్తమైన అజయ్ సోదరి.. అతన్ని సంజయ్ గాంధీ హాస్పిటల్‌కు తరలించింది. అజయ్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులకు సమాచారం అందించింది. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు చిన్నారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ వద్దే డబ్బు తీసుకొని, తమనే కొడుతుండటంతో, విసిగిపోయి ఈ దారుణానికి ఒడిగట్టామని పోలీసుల విచారణలో చిన్నారులు అంగీకరించారు.