Harish Rao: సీఎం చంద్రబాబుకు.. హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్

విధాత, వెబ్ డెస్క్: సముద్రంలోకి వెలుతున్న గోదావరి జలాల (Godavari Waters)ను కరవు ప్రాంతానికి మళ్లించేందుకు బనకచర్ల వంటి ప్రాజెక్టులు కడితే ఎవరికి బాధ ఎందుకంటూ పరోక్షంగా తెలంగాణ నేతలనుద్ధేశించి చంద్రబాబు (Chandrababu)చేసిన వ్యాఖ్యల (Comments)కు బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు (T. Harish Rao) కౌంటర్ (Counter) వేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే, తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అభ్యంతరం లేదని కేంద్రానికి లేఖ రాయాలని హరీష్ రావు ఎక్స్ వేదికగా సవాల్ చేశారు.
గతంలో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు రాసిన కొన్ని లేఖలను హరీష్ రావు ఈ సందర్భంగా పోస్టు చేశారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులలో ఇప్పటికే 657టీఎంసీల నీళ్లను వాడుకుందని..మరోవైపు ఖమ్మం, నల్లగొండ జిల్లాల పంటలు ఎండిపోతున్నాయని హరీష్ రావు గుర్తు చేశారు.
చంద్రబాబు సమన్యాయం, రెండు కళ్ల సిద్ధాంతం ఇదేనా అని హరీష్ రావు నిలదీశారు. మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే సమ్మక్క, సీతమ్మ సాగర్, వార్థా ప్రాజెక్టు, కాళేశ్వరం మూడో ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వమని చెప్పండని..మేం మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉందని నమ్ముతామని అప్పుడు మీ రెండు కళ్ల సిద్ధాంతం కరెక్టు అని చెబుతామని స్పష్టం చేశారు.
మీకు ఏనాడు తెలంగాణపై ప్రేమ లేదన్నారు. మా హక్కుల కోసం ఏనాడు పోరాడలేదని విమర్శించారు. తెలంగాణ పై ప్రేమ ఉంటే గోదావరిలో తెలంగాణకు 969టీఎంసీలు కేటాయించారని..అవి మమ్మల్ని వాడుకోనివ్వాలని చంద్రబాబును హరీష్ రావు కోరారు.