MLC Kavitha | ఈనెల 23 వరకు కవిత కస్టడీ పొడిగింపు

  • Publish Date - April 9, 2024 / 02:10 PM IST

విధాత : ఢిల్లీ లిక్కర్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 23 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. 14 రోజులుగా తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు జ్యూడిషియల్ కస్టడీ పొడిగించడంతో ఆమెను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు. కోర్టులో కవితకు నేరుగా మాట్లాడేందుకు జడ్జీ అనుమతించలేదు.

కోర్టు అనుమతితో కవితను భర్త, మామలు కలిశారు . కోర్టు ప్రాంగణంలో మీడియా తో మాట్లాడిన కవిత ఇది పూర్తిగా రాజకీయ కక్షపూరిత కేసు అని, బిజెపికి ఓటేయొద్దని తెలంగాణ ప్రజలను కోరుతున్నానని తెలిపింది. సిబిఐ ఇప్పటికే నా స్టేట్మెంట్ రికార్డ్ చేసిందనీ, విపక్షాలను టార్గెట్ చేసేందుకే లిక్కర్ కేసు పెట్టారనీ ఆరోపించింది.

Latest News