MP Komatireddy | ఖాతాల్లో.. రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతయ్?: CM KCRకి కోమటిరెడ్డి లేఖ
MP Komatireddy CM KCRకి భువనగిరి MP కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతాయి.. పనులు గేటు కూడా దాటవు రైతు బంధు పూర్తిస్థాయిలో ఎప్పుడిస్తారు విధాత: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి లేఖరాశారు. రైతు బంధు పూర్తిస్థాయిలో ఎప్పుడిస్తారంటూ లేఖలో ప్రస్థావించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయినా కూడా డబ్బులు అందక పోవడంతో రైతులు ఇబ్బందులు ఎదొర్కొంటున్నారని కోమటిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. CM KCR […]

MP Komatireddy
- CM KCRకి భువనగిరి MP కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతాయి.. పనులు గేటు కూడా దాటవు
- రైతు బంధు పూర్తిస్థాయిలో ఎప్పుడిస్తారు
విధాత: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి లేఖరాశారు. రైతు బంధు పూర్తిస్థాయిలో ఎప్పుడిస్తారంటూ లేఖలో ప్రస్థావించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయినా కూడా డబ్బులు అందక పోవడంతో రైతులు ఇబ్బందులు ఎదొర్కొంటున్నారని కోమటిరెడ్డి లేఖలో పేర్కొన్నారు.
CM KCR మాటలు కోటలు దాటుతాయి.. పనులు గేటు కూడా దాటవు.. దీనికి నిదర్శనమే రైతు బంధు డబ్బుల జమ అని అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతులు పనులు ప్రారంభించారు. కానీ, రైతు బంధు మాత్రం పూర్తి స్థాయిలో అందలేదు. ఇంకా లక్షల మంది అన్నదాతలు ఆ నగదు కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొందన్నారు.
బ్యాంకు అకౌంట్ లో డబ్బులు ఎప్పుడు పడతాయి? మెసేజ్ వచ్చి సెల్ ఫోన్ ఎప్పుడు మోగుతుందా అని రైతులు చూస్తున్నారని తెలిపారు. వానాకాలం సాగు ప్రారంభం కావడంతో రైతులు ముందుగా వరి నార్లు పోశారు. కానీ, చాలా వరకు పత్తి సాగు వైపు మళ్లారు.
వరి విత్తనాల కొనుగోలుకే రైతులు దాచుకున్న డబ్బులు అయిపోయాయి. పత్తి విత్తనాల కొనుగోలుకు రైతుబంధు వస్తుందన్న ఆశతో అప్పులు చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు. కానీ, ఇంతవరకు రైతులందరికీ రైతు బంధు నగదు అందలేదు. ఆర్థికశాఖ కొంతవరకే నిధులు విడుదల చేసిందని తెలిసింది. దీనివల్ల కొందరికే జమ అయ్యాయి. మిగిలిన వారికి ఎదురుచూపులు తప్పడం లేదని కోమటిరెడ్డి లేఖలో పేర్కొన్నారు.
ఈ ఏడాది రైతు బంధు కింద దాదాపు 70 లక్షల మంది అర్హులుగా ఉన్నారు. మొత్తం రూ.7,720.29 కోట్ల నిధులు అవసరమని అంచనా. మరి, అందరికీ ఎప్పుడు జమచేస్తారు. రైతు ప్రభుత్వం అని గప్పాలు కొట్టుకోవడం కాదని విమర్శించారు.. రైతు బంధు పూర్తిస్థాయిలో ఎప్పుడిస్తారో చెప్పండి. రైతు సంఘాల ద్వారా నాకు మరో విషయం తెలిసింది.
రైతు బంధు డబ్బులు బ్యాంకు ఖాతాలలో జమ చేయగా వాటిని తీయడానికి వీలు లేకుండా అకౌంట్ లను హోల్డ్ లో పెడుతున్నారట. రైతు బంధు పేరుతో ప్రభుత్వం ఒకవైపు డబ్బులు వేస్తూనే.. మరోవైపు బ్యాంకులలో రుణాలు చెల్లించాలనే కారణంతో రైతుల ఖాతాలను హోల్డ్ లో ఉంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు.
లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు చేయకపోవడంతో బ్యాంకులలో వడ్డీల మీద వడ్డీలు పెరిగి అన్నదాతల అప్పులు రెట్టింపయ్యాయి. మీరు చేసిన మోసంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే హోల్డ్ లో పెట్టిన అకౌంట్స్ ను తిరిగి ప్రారంభించి రైతులకు నగదు అందేలా చేయాలి. అలాగే, మిగిలిన రైతులకు కూడా రైతు బంధు నగదును వెంటనే జమ చేయాలి. లేదంటే, రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని, తర్వాతి పరిణామాలకు మీదే బాధ్యతని హెచ్చరించారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.