Site icon vidhaatha

Laura McClure: పార్లమెంటులో ఎంపీ నగ్న ఫోటో.. !

Laura McClure : న్యూజిలాండ్ పార్లమెంట్‌ మహిళా ఎంపీ తన నగ్న ఫోటోను ఏకంగా పార్లమెంటులోనే ప్రదర్శించి సంచలనం రేపింది. ఆ ఎంపీ అలా ఎందుకు చేసిందన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. పార్లమెంటు సమావేశాల్లో ఏసీటీ పార్టీ ఎంపీ లారా మెక్‌క్లూర్  ఓ మహిళ నగ్న ఫోటోను చూపిస్తూ..ఇది నా నగ్న ఫోటో అని ప్రకటించారు. ఆమె చర్యను చూసిన పార్లమెంటులోని ఎంపీలు అంతా ఆశ్చర్యపోయారు. మీరంతా చూస్తున్నది నా నగ్న ఫోటోనే..కాని ఇది నేను ఏఐ జనరేటెడ్ డీప్‌ఫేక్ ఫోటోను ఉపయోగించి 5 నిమిషాల్లో తయారు చేశానని తెలిపారు. ఫోటోను సృష్టించి గూగుల్ లో అప్ లో డ్ చేసి అందులో నుంచి ప్రింట్ తీసుకున్నానని వివరించారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఎవరికైనా నగ్న ఫోటోను తయారు చేయడం ఎంత సులభమైందో మొత్తం పార్లమెంటు దృష్టికి తీసుకురావాలనుకుంటున్నానని అందుకే తాను ఇలా చేశానని లారా మెక్‌క్లూర్ తెలిపారు. చట్టసభను అగౌరవపరిచే ఉద్దేశంతో తాను ఈ పనిచేయలేదని. డీప్‌ఫేక్  ఫోటోలు, వీడియోలతో ఎక్కువ మంది యువతులు ఇబ్బంది పడుతున్నారని..ఈ సమస్య తీవ్రతను పార్లమెంటు గుర్తించాలని ఈ ప్రయత్నం చేశానని చెప్పారు. డీప్ ఫేక్ ఫోటోలతో మహిళలను అప్రతిష్ట పాలు చేసే వారిని కఠినంగా శిక్షించేందుకు సంబంధించిన కొత్త చట్టం బిల్లును న్యూజిలాండ్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు మద్దతునిస్తున్న లారా మెక్‌క్లూర్ డీప్ ఫేక్ సమస్య పరిష్కారానికి కొత్త చట్టం పరిష్కారం చూపాలని ఆకాంక్షించారు.

డీప్ ఫేక్ చాల ప్రమాదకరంగా తయారైందని…అలాంటి ఫోటోలు, వీడియోలతో జీవితాలు నాశనం అవుతున్నాయని.నేను చేసిన పని జుగుప్సాకరంగా అనిపించవచ్చని..కాని మీరంతా ఈ సమస్యపై ఆలోచన చేయాలనే అలా చేశానని తెలిపారు. అయితే సమస్య సాంకేతితతో కాకుండా…దానిని తప్పుడు మార్గంలో వినియోగించడమేనని..అందుకే వీటి కట్టడికి ప్రత్యేక కఠిన చట్టాలు అవసరమని లారా మెక్‌క్లూర్ తెలిపారు. కాగా డీప్ ఫేక్ సమస్య తీవ్రతను చెప్పే  క్రమంలో పార్లమెంటు సమావేశాల్లో ఓ మహిళా ఎంపీ తన నగ్న ఫోటోను(డీప్ ఫేక్) ప్రదర్శించిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ తన వాదనను వినిపించేందుకు ఇలాంటి చర్యకు పాల్పడాల్సిన అవసరం లేదని కొందరు.. మహిళలు ఎదుర్కొంటున్న డీప్ ఫేక్ ఫోటోల సమస్యను ఎంపీ లారా మెక్‌క్లూర్  చక్కగా వివరించారని మరికొందరు సమర్ధిస్తున్నారు.

 

 

Exit mobile version