Mrunal Thakur | మృణాల్‌ని ఇలా తగులుకున్నారేంటబ్బా..

Mrunal Thakur విధాత‌: ఓ హిట్ పడి ఆ హీరోయిన్ నాలుగు అవకాశాలతో జోరుమీద ఉందంటే చాలు ఇంకేముంది.. ఆ హీరోయిన్‌కి పొగరు తలకెక్కేసింది.. ఒక్కసారే రెమ్యునరేషన్ పెంచేసిందనే మాటలు బయటికొస్తాయి. సదరు అమ్మడి ప్రమేయం ఏమాత్రం లేకున్నా ఈ సమాచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. ఇంకేముంది నటనలో అంతా ఇంతా తోపని తెగపొగిడేసి, తీరా చూస్తే ‘చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలా’ అవుతుంది పరిస్థితి. చేతికందే ఆ నాలుగు ఛాన్సులూ అందకుండా పోతాయి. బాబోయ్.. […]

  • By: Somu    latest    Jul 19, 2023 11:14 AM IST
Mrunal Thakur | మృణాల్‌ని ఇలా తగులుకున్నారేంటబ్బా..

Mrunal Thakur

విధాత‌: ఓ హిట్ పడి ఆ హీరోయిన్ నాలుగు అవకాశాలతో జోరుమీద ఉందంటే చాలు ఇంకేముంది.. ఆ హీరోయిన్‌కి పొగరు తలకెక్కేసింది.. ఒక్కసారే రెమ్యునరేషన్ పెంచేసిందనే మాటలు బయటికొస్తాయి. సదరు అమ్మడి ప్రమేయం ఏమాత్రం లేకున్నా ఈ సమాచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. ఇంకేముంది నటనలో అంతా ఇంతా తోపని తెగపొగిడేసి, తీరా చూస్తే ‘చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలా’ అవుతుంది పరిస్థితి. చేతికందే ఆ నాలుగు ఛాన్సులూ అందకుండా పోతాయి. బాబోయ్.. ఆ హీరోయిన్‌ని భరించలేం అనేసి పక్కకు నెట్టేస్తారు. ఇలా చాలా మంది హీరోయిన్లకి జరిగింది.. జరుగుతోంది. ఇక విషయంలోకి వస్తే..

సీతారామం మూవీతో తెలుగు తెరకు పరిచయమై, మంచి ఆర్టిస్ట్ అనిపించుకున్న మృణాల్ ఠాకూర్ పైన ప్రస్తుతం టాలీవుడ్ హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ అనే ముద్ర పడిపోయింది. ఈ ప్రచారం వల్ల మృణాల్‌కి ఛాన్సులు తగ్గినా ఆశ్చర్యపడక్కరలేదు. మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది మృణాల్. ప్రస్తుతం నేచురల్ స్టార్ నానీతో ‘హాయ్ నాన్న’ అనే మూవీ చేస్తుంది. విజయ్ దేవరకొండతోనూ మరో మూవీలో నటిస్తోంది.

అయితే ఆమెపై ఎప్పుడు కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. రెమ్యునరేషన్ పెంచేసిందనే మాటతో మృణాల్‌కి కలిసిరావడం కన్నా, వచ్చే అవకాశాలు కూడా రావడం మానేస్తాయని.. గతంలో కృతి శెట్టి విషయంలోనూ ఇదే జరిగిందని ఆమె అభిమానుల కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి మృణాల్ ఠాకూర్‌కి అంత సీన్ ఉందా.. సీతారామం తర్వాత మరో కమర్షియల్ హిట్ ఇంకా పడనే లేదు అప్పుడే ఇదంతా ఏంటని అనుకునేవారు కూడా లేకపోలేదు.

ఇలాంటి మాటలతో హీరోయిన్స్ వెనుక ప్రచారం చేసి వాళ్ళకు వచ్చే ఆ నాలుగు అవకాశాలను రాకుండా చేయడమేనని.. దీనికోసం ఇండస్ట్రీలో ఓ బ్యాచ్ ఎప్పుడూ కాచుకుని కూర్చుంటుందనేలా టాక్ వినబడుతోంది. ముందు పొగిడేసి ఆకాశానికి ఎత్తేయడం.. అవకాశాలు తగ్గితే పాతాళానికి తొక్కేసేది వీళ్ళేనని నెట్టింట ప్రచారం జోరందుకుంది. చూడాలి.. ఈ దెబ్బతో మృణాళ్‌కి నాలుగు పెద్ద సినిమాలు వచ్చినా రావచ్చు, లేదా సినీ ఇండస్ట్రీలో మృణాళ్ కనిపించకుండా పోయినా పోవచ్చు. అన్నట్లు.. ఇప్పుడు రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చినట్లుగా వార్తలు వినబడుతుండటం విశేషం.