Ms Dhoni |
భారత్‌కి మూడుసార్లు ఐసీసీ ట్రోఫీ అందించిన ఒకే ఒక్క కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. కూల్ కెప్టెన్‌గా మంచి పేరు తెచ్చుకున్న ధోని ఎంతో మంది యువ క్రికెటర్స్‌ని కూడా పరిచయం చేశాడు. మూడేళ్ల క్రితం ఆగస్ట్ 15న తన తల్లి బర్త్ సందర్భంగా రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఇప్పుడు కేవలం ఐపీఎల్‌లో ఆడుతున్నాడు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో ధోని మోకాలి నొప్పితో బాధపడ్డాడు. అయితే ఆయనకి ఇదే చివరి ఐపీఎల్ అని అందరు అనుకున్నారు. కాని ధోని మరో ఐపీఎల్ ఆడాలని అనుకుంటున్నాడని ఇటీవల ఆయన భార్య సాక్షి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ విషయం విని ధోని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ధోని క్రికెటర్‌గానే కాకుండా బిజినెస్‌మెన్‌గా కూడా రాణిస్తున్నారు.
ఈ క్రమంలో కోట్ల ఆస్తులు కూడా సంపాదించాడు. అయితే ఎంత ఉన్నా ఒదిగి ఉండడం ధోని స్పెషాలిటి. ఆయన ఖాళీ సమయాలలో ధోనీ, ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నడం, వ్యవసాయం చేయడం వంటివి చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు.
రాంఛీలో ధోనీ ఫామ్ హౌజ్‌లో పండించే పంటలు, ఇండియాలోనే కాకుండా ఇండోనేషియా, సింగపూర్ వంటి దేశాల్లో కూడా అమ్ముడుపోతున్నాయట.ధోని ఏ పని మొదలు పెట్టిన అది సక్సెస్ కావాల్సిందే. ఆయన పాల ఉత్పత్తులతో పాటు కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారం కూడా మొదలు పెట్టి మంచి లాభాలు రాబట్టాడు. స్టాబెర్రీ, కాలిఫ్లవర్ వంటి పంటలను పండించి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.
అయితే ధోని కాలు మీద కాలు వేసుకొని ఇంట్లో కూర్చున్నా కూడా తరగనంత సంపాదన ఆయనకి ఉంది. తరతరాలు కూడా తినే అంత సంపాదించిపెట్టాడు. అయినప్పటికీ వ్యవసాయంపైనే ధోని ఫోకస్ పెట్టాడు. అందుకు కారణం.. చిన్నప్పటి నుండి వ్యవసాయం చూస్తూ పెరిగాడు. చిన్నప్పటి నుండి అతనికి మొక్కలు, చెట్లు అంటే ఎంతో ఇష్టం.
రాత్రికి రాత్రి పండ్లు అలా ఎలా పెరుగుతాయి? పూలు ఎలా విచ్చుకుంటాయనేది నిద్రపోకుండా చూడాలని అనుకునేవాడట. కోవిడ్ వలన అతనికి చాలా సమయం దొరకడంతో వ్యవసాయం చేశాడు . మెల్లిమెల్లిగా వ్యవసాయం మొదలు పెట్టిన ధోని ఇప్పుడు మొత్తం 40 ఎకరాల్లో పంటలు పండిస్తున్నట్టు స్వయంగా చెప్పుకొచ్చాడు. ఎంత ఆస్తులు ఉన్నా కూడా ధోని వ్యవసాయంపై మక్కువ చూపించడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం