Nalgonda | కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం.. నిరుద్యోగ నిరసన ర్యాలీలో రేవంత్‌తో.. కాంగ్రెస్ సీనియర్లు!

Nalgonda విధాత: నల్గొండ(Nalgonda)లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీకి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ సీనియర్లు కే.జానారెడ్డి, ఎన్. ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు హాజరైన నేపథ్యంలో పార్టీ శ్రేణులలో ఉత్సాహం వ్యక్తమైంది. అంతా కలిసి ఒకే వేదికపై కనిపించడంతో కార్యకర్తలు ఈలలు, కేరింతలతో తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. నిరుద్యోగ నిరసన ర్యాలీకి వచ్చిన రేవంత్ రెడ్డికి చౌటుప్పల్, నార్కట్పల్లి, నల్లగొండలలో గజమాలలతో భారీ స్వాగతం పలికారు. […]

Nalgonda | కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం.. నిరుద్యోగ నిరసన ర్యాలీలో రేవంత్‌తో.. కాంగ్రెస్ సీనియర్లు!

Nalgonda

విధాత: నల్గొండ(Nalgonda)లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీకి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ సీనియర్లు కే.జానారెడ్డి, ఎన్. ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు హాజరైన నేపథ్యంలో పార్టీ శ్రేణులలో ఉత్సాహం వ్యక్తమైంది. అంతా కలిసి ఒకే వేదికపై కనిపించడంతో కార్యకర్తలు ఈలలు, కేరింతలతో తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

నిరుద్యోగ నిరసన ర్యాలీకి వచ్చిన రేవంత్ రెడ్డికి చౌటుప్పల్, నార్కట్పల్లి, నల్లగొండలలో గజమాలలతో భారీ స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నిరుద్యోగులు, విద్యార్థులు, నిరసన ర్యాలీకి హాజరవడంతో నల్గొండ గడియారం సెంటర్ కిక్కిరిసిపోయింది. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులను, ప్రజలను, నిరుద్యోగ యువతను ఉద్దేశించి నాయకులు ఉత్సాహంగా ప్రసంగించారు.

సూర్యాపేట నుండి మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి హాజరు కానప్పటికీ ఆయన ప్రధాన అనుచరుడు డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న నిరుద్యోగ నిరసన ర్యాలీకి హాజరయ్యారు. ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్లు మాజీ ఎంపీలు బలరాం నాయక్ , మల్లు రవి, వి. హనుమంతరావు తోపాటు మాజీ ఎమ్మెల్యే ఎన్.బాలునాయక్, డిసిసి అధ్యక్షులు శంకరనాయక్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి,

చలమల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి, పున్న కైలాష్ , బల్మూరి వెంకట్, బీర్ల ఐలయ్య యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి కుమారులు జైవీర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, నగరి ప్రీతం, కొండేటి మల్లయ్య, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి , మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి తదితరులు హాజరయ్యారు.