Upasana | మెగా ఇంట కవలల సందడి… డెలివరీ వీడియో షేర్ చేసిన ఉపాస‌న‌

Upasana | మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు అంబరాన్నంటుతున్నాయి. జనవరి 31న రామ్ చరణ్ సతీమణి ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో కుటుంబ సభ్యులు, అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఒక బాబు, ఒక పాప జన్మించగా ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఉపాసన తన ఎక్స్ ఖాతాలో డెలివరీ రోజున జరిగిన అనుభూతులను చూపించే ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • By: sn |    movies |    Published on : Feb 10, 2026 7:53 AM IST
Upasana | మెగా ఇంట కవలల సందడి… డెలివరీ వీడియో షేర్ చేసిన ఉపాస‌న‌

Upasana | మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు అంబరాన్నంటుతున్నాయి. జనవరి 31న రామ్ చరణ్ సతీమణి ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో కుటుంబ సభ్యులు, అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఒక బాబు, ఒక పాప జన్మించగా ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఉపాసన తన ఎక్స్ ఖాతాలో డెలివరీ రోజున జరిగిన అనుభూతులను చూపించే ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో రామ్ చరణ్–ఉపాసన ఆసుపత్రిలోకి అడుగుపెట్టిన క్షణాలు, కుటుంబ సభ్యుల ఉత్కంఠ, ఆతృత స్పష్టంగా కనిపిస్తాయి.

ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి తాతయ్యగా వ్యక్తం చేసిన ఆనందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆసుపత్రిలో ఓపికగా ఎదురుచూసిన చిరంజీవి, పిల్లలు పుట్టిన వెంటనే బయటకు వచ్చి అభిమానులకు శుభవార్త తెలియజేసిన దృశ్యాలు అభిమానులను కదిలించాయి. “చాలా కాలంగా ఎంతోమంది ఎదురుచూస్తున్న శుభఘడియ ఇది. దేవుడి దయతో ఒక బాబు, ఒక పాప మా కుటుంబంలోకి వచ్చారు” అంటూ ఆయన చెప్పిన మాటలు వీడియోలో హైలైట్‌గా నిలిచాయి. ఈ వార్త తెలిసిన వెంటనే ఆసుపత్రి బయట అభిమానులు గులాబీ, నీలం రంగు బెలూన్లను గాల్లోకి ఎగరేస్తూ డ్యాన్సులతో సంబరాలు జరుపుకున్నారు.

వీడియోను పంచుకుంటూ ఉపాసన చేసిన భావోద్వేగ పోస్టు కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. “ఈ వీడియోను ప్రతిసారి చూస్తే నా గుండె నిండినట్లు అనిపిస్తుంది. మా చుట్టూ ఉన్న ప్రేమ, బలం, పాజిటివిటీకి నేను ఎప్పుడూ కృతజ్ఞురాలిని. అపోలో టీమ్ మాకు అందించిన సేవలు అమూల్యమైనవి. చరణ్ అభిమానుల ప్రేమ స్వచ్ఛమైనదని నాకు తెలుసు. అయితే మా పిల్లల భద్రత, ప్రైవసీని గౌరవిస్తారని నమ్ముతున్నాను” అంటూ ఆమె పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా తమ కోసం ప్రార్థించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

ఇంకా విశేషమేమిటంటే తమ మొదటి కూతురు క్లిన్ కారా కొణిదెల జన్మించిన అదే డెలివరీ గదిలోనే ఇప్పుడు కవలలు కూడా పుట్టడం కుటుంబానికి ఒక ప్రత్యేక సెంటిమెంట్‌గా మారింది. ఈ అంశాన్ని కూడా వీడియోలో ప్రస్తావించడం అభిమానులను మరింత ఆనందపరిచింది.రామ్ చరణ్ వ్యక్తిగత జీవితంతో పాటు సినీ ప్రయాణం కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా కొనసాగుతోంది. 2012 జూన్‌లో రామ్ చరణ్–ఉపాసన వివాహం జరిగింది. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి. రెడ్డికి ఉపాసన మనవరాలు అన్న విషయం తెలిసిందే. 2023 జూన్‌లో వీరికి మొదటి సంతానంగా క్లిన్ కారా జన్మించగా, ఇప్పుడు కవలల రాకతో మెగా ఇంట సందడి రెట్టింపైంది.