హృద‌య విదార‌కం.. ఇనుప చువ్వ‌ల‌పై వేలాడిన ప‌సికందు

ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న‌.. ఆ ప‌సిగుడ్డు చేసిన నేర‌మేంటో తెలియ‌దు కానీ.. ఇనుప చువ్వ‌ల‌పై వేలాడ‌దీశారు. ప‌దునైన ఇనుప చువ్వ‌ల‌కు వేలాడుతున్న ప‌సిపాప మృత‌దేహాన్ని చూసి స్థానికులు షాక్‌కు గుర‌య్యారు

  • Publish Date - March 2, 2024 / 10:28 AM IST

విధాత: ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న‌.. ఆ ప‌సిగుడ్డు చేసిన నేర‌మేంటో తెలియ‌దు కానీ.. ఇనుప చువ్వ‌ల‌పై వేలాడ‌దీశారు. ప‌దునైన ఇనుప చువ్వ‌ల‌కు వేలాడుతున్న ప‌సిపాప మృత‌దేహాన్ని చూసి స్థానికులు షాక్‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న హ‌ర్యానాలోని అజ్రోందా గ్రామంలో శ‌నివారం తెల్ల‌వారుజామున వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. అజ్రోందా గ్రామంలోని ఓ ఇంటి ప్ర‌హ‌రీ గోడ‌పై ఏర్పాటు చేసిన ఇనుప చువ్వ‌ల‌పై ఓ ప‌సికందు మృత‌దేహం వేలాడుతూ ఉంది. శ‌నివారం పొద్దున్నే పసిపాప‌ను చూసి స్థానికులు షాక్‌కు గుర‌య్యారు. పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఇనుప చువ్వ‌ల‌పై ఉన్న పాప మృత‌దేహాన్ని జాగ్ర‌త్త‌గా పోలీసులు తీశారు. అనంత‌రం పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌బాడీని ఫ‌రిదాబాద్‌లోని బాద్‌షాహ్ ఖాన్ సివిల్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. పోస్టుమార్టంలో శిశువు మృతికి గ‌ల కార‌ణాలు తెలిసే అవ‌కాశం ఉంది.

అయితే పాప‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా చంపేశారా..? లేక ఇంకేమైనా జ‌రిగి ఉంటుందా..? అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఘ‌ట‌నాస్థ‌లికి స‌మీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీల‌ను పోలీసులు ప‌రిశీలించారు. ఈ ఘ‌ట‌న‌పై స్థానికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌సిపాప త‌ల్లిదండ్రుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు. కానీ ప‌సిబిడ్డ త‌ల్లిదండ్రుల వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Latest News