ORR | మంత్రి KTRను జైల్లో పెట్టే వరకు పోరాటం: రేవంత్‌ రెడ్డి

ORR రూ. 750 కోట్ల ఆదాయం వస్తున్న ORRను రూ. 246 కోట్లకే కట్టబెట్టిన సర్కారు కాంగ్రెస్‌ పార్టీ ORRను నిర్మిస్తే కేటీఆర్‌ అమ్ముకున్నారు అరవింద్‌ కుమార్‌ KCR ఫామ్‌ హౌజ్‌లో ఉన్నాడా? ఆర్‌టీఐ దరఖాస్తుకు కనీసం స్టాంప్‌ కూడా వేయరా? అధికారంలోకి రాగానే విచారణ.. ఎవ్వరినీ వదలి పెట్టం మీడియాతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విధాత: ఔటర్‌ రింగ్‌ రోడ్‌(ORR) టోల్‌ వసూలు టెండర్ లో భారీ కుంబకోణం జరిగిందని, తమ ప్రభుత్వం వచ్చాక […]

  • Publish Date - May 1, 2023 / 12:41 AM IST

ORR

  • రూ. 750 కోట్ల ఆదాయం వస్తున్న ORRను రూ. 246 కోట్లకే కట్టబెట్టిన సర్కారు
  • కాంగ్రెస్‌ పార్టీ ORRను నిర్మిస్తే కేటీఆర్‌ అమ్ముకున్నారు
  • అరవింద్‌ కుమార్‌ KCR ఫామ్‌ హౌజ్‌లో ఉన్నాడా?
  • ఆర్‌టీఐ దరఖాస్తుకు కనీసం స్టాంప్‌ కూడా వేయరా?
  • అధికారంలోకి రాగానే విచారణ.. ఎవ్వరినీ వదలి పెట్టం
  • మీడియాతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి

విధాత: ఔటర్‌ రింగ్‌ రోడ్‌(ORR) టోల్‌ వసూలు టెండర్ లో భారీ కుంబకోణం జరిగిందని, తమ ప్రభుత్వం వచ్చాక దీనిపై పూర్తి స్థాయి విచారణ చేస్తామని, దీనికి దోషులైన వారిని ఎవ్వరిని వదలి పెట్టమని పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం పురపాలక శాఖ పరిపాలనా భవనంలో ఆర్‌టీఐ కింద దరఖాస్తు చేసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఔటర్‌ టోల్‌పై ఏడాదికి రూ. 750 కోట్ల ఆదాయం వస్తుంటే కేవలం ముంబైకి చెందిన సంస్థకు రూ. 246 కోట్లకే కట్టబెట్టడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా, భవిష్యత్ తరాలకు వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చాలని, అభివృద్ధిని అందించాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6696 కోట్లతో ORR నిర్మించిందని రేవంత్‌ అన్నారు. ఖర్చు చేసిన డబ్బులను తిరిగి రాబట్టుకోవడానికి టోల్ విధానం నాటి ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసి టోల్ వసూలు చేసే ఏర్పాటు చేసిందన్నారు. ఈ విధానం ద్వారా ప్రతి ఏటా ప్రభుత్వానికి రూ. 750కోట్ల టోల్ ఆదాయం వస్తుందన్నారు.

ఇలా ఆదాయం వస్తున్న ORRను ముంబైకి చెందిన ఐఆర్‌బీ సంస్థకు కేవలం రూ. 7388 కోట్లకు 30 ఏళ్ల లీజుకు అప్పగించారని ఆరోపించారు. ప్రస్తుత విధానంలో ఏడాదికి రూ. 750కోట్లు వస్తుంటే కేవలం రూ. 246కోట్లకే ముంబై కంపెనీకి కట్టబెట్టడాన్ని రేవంత్‌ తప్పు పట్టారు. బంగారు బాతును కేటీఆర్ 30 ఏళ్లకు ఓఆర్ఆర్ ను తెగనమ్మారు. ఆరునెలల్లో దిగిపోయే ముందు ప్రభుత్వం ORRను అమ్ముకున్నారని ఆరోపించారు.

ఆదివారం నుంచే సెక్రటేరియట్ నుంచి పరిపాలన సాగుతుందని కేసీఆర్ చెప్పారని రేవంత్‌ అన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాల గురించి ఉపన్యాసం ఇచ్చిన సీఎం కేసీఆర్‌ 24గంటలు తిరక్కముందే మరిచారన్నారు. గత 20 ఏళ్లలో ఎప్పుడూ ఎమ్మెల్యేలు, ఎంపీలను సచివాలయానికి రాకుండా అడ్డుకోలేదన్నారు. టోల్ కు సంబంధించి టెండర్ ప్రక్రియ లో పాల్గొన్న కంపెనీల వివరాలు ఆర్టీఐ ద్వారా అడిగేందుకు మాత్రమే సచివాలయానికి వెళ్లానన్నారు. కానీ పోలీసులు చుట్టుముట్టి నన్ను అడ్డుకున్నారన్నారు.

Latest News