Penguin | MRI చేయించుకున్న పక్షిగా చరిత్రకెక్కిన పెంగ్విన్‌..!

Penguin | మానవులు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటారు. కానీ, పక్షులు జంతువులకు మాత్రం ఇలాంటివేవీ ఉండవు. ఎవరైనా పెంచుకుంటే, లేదంటే పార్క్‌లో ఉండే వాటి ఆయా పక్షుల, జంతువుల బాగోగులను చూసుకుంటూ.. అస్వస్థతకు గురైన వెటర్నరీ ఆసుప్రతులకు తీసుకెళ్లి ఏవో పరీక్షలు చేసి పంపిస్తుంటారు. కానీ, చరిత్రలో తొలిసారిగా ఓ పక్షి ఎంఆర్‌ఐ స్కానింగ్‌ చేయించుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్‌ వెల్లింగ్టన్‌లోని అడ్వెంచర్‌ పార్క్‌లో ఉంటున్న ‘చకా’ పెంగ్విన్‌ […]

Penguin | MRI చేయించుకున్న పక్షిగా చరిత్రకెక్కిన పెంగ్విన్‌..!

Penguin | మానవులు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటారు. కానీ, పక్షులు జంతువులకు మాత్రం ఇలాంటివేవీ ఉండవు. ఎవరైనా పెంచుకుంటే, లేదంటే పార్క్‌లో ఉండే వాటి ఆయా పక్షుల, జంతువుల బాగోగులను చూసుకుంటూ.. అస్వస్థతకు గురైన వెటర్నరీ ఆసుప్రతులకు తీసుకెళ్లి ఏవో పరీక్షలు చేసి పంపిస్తుంటారు. కానీ, చరిత్రలో తొలిసారిగా ఓ పక్షి ఎంఆర్‌ఐ స్కానింగ్‌ చేయించుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్‌ వెల్లింగ్టన్‌లోని అడ్వెంచర్‌ పార్క్‌లో ఉంటున్న ‘చకా’ పెంగ్విన్‌ ఉంది. అది కొద్ది రోజులుగా నిలబడడం, కదలికలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంది. ఇందుకు గల కారణాలు ఏంటో తెలుసుకునేందుకు వెటర్నరీ వైద్యులు వైద్య పరీక్షలు చేశారు.

అయితే, సమస్య ఏంటో తెలియకపోవడంతో ఎంఆర్‌ఐ స్కానింగ్‌ చేయాలని నిర్ణయించి.. పరీక్షలు చేశారు. అయితే, పెంగ్విన్‌ మాత్రం ఎలాంటి భయం లేకుండా పరీక్షలు చేయించుకుంది. ఏం జరుగుతుందో అంతా నిశితంగా గమనించడం పశు వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. పరీక్షల తర్వాత పెంగ్విన్‌ మిగతా వాటిలాగానే యథావిధిగా నడుస్తున్నది. ప్రస్తుతం దాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అడ్వెంచర్‌ పార్క్‌ వివరించింది. చరిత్రలో తొలిసారిగా ఎంఆర్‌ఐ పరీక్ష చేయించుకున్న పక్షిగా ‘చకా’ నిలిచిందని, స్కానింగ్‌ సముద్ర జాతికి చెందిన పక్షులు, జంతువులతో పాటుగా అభయరణ్యాలు, పార్క్‌ల్లో పెరిగే జంతువులు గురించి మరింత అధ్యయనం చేసేందుకు ఉపయోగపడుతుందని వెటర్నరీ వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.