Prabhas | విజయవాడ పునుగులంటే ప్రత్యేక ప్రేమ.. చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్న పాన్ ఇండియా స్టార్
Prabhas | పాన్ ఇండియా స్టార్ Prabhas కు ఫుడ్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి అభిమానులకు తెలిసిందే. షూటింగ్ స్పాట్స్‌లో సహనటులకు, టెక్నీషియన్లకు స్వయంగా భోజనం పంపించడం నుంచి ప్రాంతీయ వంటకాలను ఆస్వాదించడం వరకు ప్రభాస్ ఫుడ్ లవ్ గురించి ఎన్నో కథలు వినిపిస్తుంటాయి.
Prabhas | పాన్ ఇండియా స్టార్ Prabhas కు ఫుడ్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి అభిమానులకు తెలిసిందే. షూటింగ్ స్పాట్స్‌లో సహనటులకు, టెక్నీషియన్లకు స్వయంగా భోజనం పంపించడం నుంచి ప్రాంతీయ వంటకాలను ఆస్వాదించడం వరకు ప్రభాస్ ఫుడ్ లవ్ గురించి ఎన్నో కథలు వినిపిస్తుంటాయి. తాజాగా ఆయన విజయవాడ పునుగుల గురించి చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యువీ క్రియేషన్స్ ప్రమోషన్స్‌లో ఆసక్తికర చిట్‌చాట్
ప్రభాస్ నిర్మాణ సంస్థ UV Creations నిర్మించిన తాజా చిత్రానికి సంబంధించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ యూనిట్‌తో ప్రభాస్ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రభాస్‌ను సరదాగా, “మీరు విజయవాడ పునుగులు ఎప్పుడైనా తిన్నారా?” అని ప్రశ్నించింది.దీనికి స్పందించిన ప్రభాస్ ఎంతో ఆప్యాయంగా తన బాల్య స్మృతులను పంచుకున్నారు.
“నాకు విజయవాడ పునుగులు చాలా ఇష్టం. విజయవాడలో మా ప్రమోద్ (నా కజిన్, నిర్మాత) వాళ్లింటి దగ్గర ఒక పునుగుల బండి ఉండేది. చిన్నప్పుడు హాలిడేస్‌కి అక్కడికి వెళ్లేవాడిని. ప్రమోద్ వాళ్ల నాన్న మమ్మల్ని స్కూటర్‌పై కూర్చోబెట్టి తీసుకెళ్లి పునుగులు ఇప్పించేవారు. ఆ రుచి ఇప్పటికీ గుర్తుంది,” అంటూ భావోద్వేగంగా చెప్పారు.
ఇప్పటికీ ఆ రుచి మర్చిపోలేనంటున్న స్టార్
ప్రభాస్ ఇంకా మాట్లాడుతూ, “విజయవాడకు వెళ్తే పునుగులు తినాలనిపిస్తుంది. అలాంటి రుచి నేను ఎక్కడా తినలేదు. ప్రతి ఊరికి ఒక స్పెషల్ ఫుడ్ ఉంటుంది. విజయవాడకు పునుగులు ప్రత్యేకం” అని అన్నారు.తాను ఎక్కువగా నైట్ ట్రావెల్ చేస్తానని చెప్పిన ప్రభాస్, “విజయవాడ వైపు వెళ్తుంటే దారిలో పునుగుల బండి కనిపిస్తే కార్ ఆపి తినాలనిపిస్తుంది. కానీ నైట్ టైమ్‌లో దొరకవు” అంటూ నవ్వుతూ చెప్పారు.
వైరల్ అవుతున్న కామెంట్స్
ప్రభాస్ చేసిన ఈ సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ అభిమానులు “మన పునుగుల్ని గుర్తుపెట్టుకున్నాడు” అంటూ ఆ క్లిప్‌ను తెగ షేర్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ అయినా, చిన్ననాటి జ్ఞాపకాలను, ప్రాంతీయ రుచులను మర్చిపోకుండా గుర్తు చేసుకోవడం అభిమానులను మరింతగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్ ఫుడ్ లవ్‌కు ఇది మరో మధుర ఉదాహరణగా నిలిచింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram