Political Glamour | బరిలోకి జయసుధ, నితిన్, రాహుల్ సిప్లిగంజ్ విధాత: ఈసారి తెలంగాణ రాజకీయాలు సినిమా గ్లామర్ ను అద్దుకోనున్నాయి .. సినిమాల్లో ఇమేజి, కాస్త పేరు సంపాదించిన నటులు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసూచనలు కనిపిస్తున్నాయి. గతంలో బండ్లగణేష్, విజయశాంతి వంటివాళ్ళు ఎన్నికల్లో తమ ఉనికిని చాటుకోగా ఈసారి జయసుధ, ఇంకొందరు బ్యాలెట్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బిగ్ బాస్ విన్నర్, ఆస్కార్ అవార్డు కొట్టిన రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ […]
Political Glamour |
విధాత: ఈసారి తెలంగాణ రాజకీయాలు సినిమా గ్లామర్ ను అద్దుకోనున్నాయి .. సినిమాల్లో ఇమేజి, కాస్త పేరు సంపాదించిన నటులు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసూచనలు కనిపిస్తున్నాయి. గతంలో బండ్లగణేష్, విజయశాంతి వంటివాళ్ళు ఎన్నికల్లో తమ ఉనికిని చాటుకోగా ఈసారి జయసుధ, ఇంకొందరు బ్యాలెట్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
బిగ్ బాస్ విన్నర్, ఆస్కార్ అవార్డు కొట్టిన రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు సైతం ప్రజల్లో ఆదరణ ఉన్న వారికి టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తోంది. ఇందులో భాగంగా గోషామహల్ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్దిగా రాహుల్ సిప్లిగంజ్ కు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు అక్కడ బిజెపి నుంచి రాజా సింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక అక్కడ బీఆర్ఎస్ నుంచి ప్రేమ్ సింగ్ రాథోడ్ పోటీ చేసి ఓడిపోయారు. మరో వైపు కాంగ్రెస్ నుంచి పోటీకి హీరో నితిన్ సైతం రెడీ అవుతున్నారని సమాచారం.
అయన నిజామాబాద్ జిల్లాలో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. అయన తండ్రి సుధాకర్ రెడ్డికి ఆ ప్రాంతంలో మంచి పట్టు ఉండడం, కుల సమీకరణాలు కలిసిరావడం, డబ్బు పెట్టుకునే స్థోమత ఉండడంతో నితిన్ ను ఎన్నికల్లో నిలబెట్టే అవకాశం ఉందని అంటున్నారు.
మరోవైపు మొన్ననే కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే జయసుధ సైతం పోటీకి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో వైఎస్సార్ జమానాలో కాంగ్రెస్ నుంచి గెలిచిన జయసుధ మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి బండ్ల గణేష్ ఎక్కడ పోటీ చేస్తారో చూడాలి..