విధాత,సినిమా: ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాదు.. గ్లోబల్ స్టార్. ‘బాహుబలి’ తర్వాత ఆయన రేంజే మారిపోయింది. ప్రభాస్ ఈ రేంజ్, స్థాయికి కేవలం రాజమౌళి ఒక్కడే కారణం కాదు.. ఆయన పెదనాన్న కృష్ణంరాజు కూడా కారణమే. వెనుక కృష్ణంరాజు కొండలా నిలబడబట్టే.. ప్రభాస్ వీరోచితంగా దూసుకెళ్లిపోయాడు. అసలు ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కృష్ణంరాజు వారసుడిగానే అనే విషయం అందరికీ తెలిసిందే. తనకి కొడుకులు లేకపోయినా.. తమ్ముడు కొడుకైన ప్రభాస్‌ని కృష్ణంరాజు సినీ వారసుడిగా […]
విధాత,సినిమా: ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాదు.. గ్లోబల్ స్టార్. ‘బాహుబలి’ తర్వాత ఆయన రేంజే మారిపోయింది. ప్రభాస్ ఈ రేంజ్, స్థాయికి కేవలం రాజమౌళి ఒక్కడే కారణం కాదు.. ఆయన పెదనాన్న కృష్ణంరాజు కూడా కారణమే. వెనుక కృష్ణంరాజు కొండలా నిలబడబట్టే.. ప్రభాస్ వీరోచితంగా దూసుకెళ్లిపోయాడు.
అసలు ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కృష్ణంరాజు వారసుడిగానే అనే విషయం అందరికీ తెలిసిందే. తనకి కొడుకులు లేకపోయినా.. తమ్ముడు కొడుకైన ప్రభాస్‌ని కృష్ణంరాజు సినీ వారసుడిగా పలు సందర్భాలలో ప్రకటించుకున్నారు. ‘ఈశ్వర్’ చిత్రంతో ప్రభాస్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేసి.. తన అభిమానులను ప్రభాస్ వెంట నడిచేలా చేసింది కృష్ణంరాజే. ఆ తర్వాతే ప్రభాస్ తనకి తానుగా స్టార్‌గా ఎదిగాడు. మధ్య మధ్యలో ప్రభాస్‌ను ఎంకరేజ్ చేసేలా.. కృష్ణంరాజు కూడా ప్రభాస్‌తో కలిసి నటించారు.
అయితే ఇన్నాళ్లు.. పెదనాన్న వెనుక ఉన్నాడనే సపోర్ట్ ప్రభాస్‌కి కొండంత బలాన్నిచ్చింది. కానీ ఇప్పుడు పెదనాన్న లేరు. ఇప్పుడు ఆ కుటుంబానికి అన్నీ ప్రభాసే. పెదనాన్న లేకుండా ప్రభాస్ ఎలా ఇండస్ట్రీలో మూవ్ అవతాడనేది ఇప్పుడు ఆసక్తికర విషయం. ఎందుకంటే, ఇన్నాళ్లూ ప్రభాస్ సినిమాలు చేసుకుంటూ వెళుతుంటే,ఆయనకొచ్చిన కీర్తి ప్రతిష్టలు తనకొచ్చినవిగానే భావిస్తూ కృష్ణంరాజు ఎంతో సంతోష పడేవారు.
ఇంకా ఎంకరేజ్ చేసేవారు. అందుకే.. ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోకపోయినా.. ఆయన ఏం మాట్లాడలేదు. అంతగా ప్రభాస్‌కి కృష్ణంరాజు సపోర్ట్ అందిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతాయి. ప్రభాస్ పెద్దరికం తీసుకోవాలి. ఇప్పుడు కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. ఇన్నాళ్లూ పెదనాన్న మాటతో అంతా నడిచేది. ఇప్పుడలా కాదు. ఇంట్లో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలి. చాలా బాధ్యతలు ఉన్నాయి.
ఈ బాధ్యతలతో సినిమాలపై ఫోకస్ పెట్టగలడా? మరోవైపు తన పెళ్లిపై కూడా ప్రెజర్ పెరుగుతోంది. అభిమానులు కూడా ఆయన పెళ్లి కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. మొత్తంగా చూస్తే.. కృష్ణంరాజు లేని లోటు ప్రభాస్‌కి ఇప్పుడు తెలిసివచ్చే అవకాశం ఉంది. ఆ లోటుని పూరిస్తూ.. అటు ఫ్యామిలీని, ఇటు ఫ్యాన్స్‌ని మెప్పించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభాస్‌పై ఉంది. మరి ఆ బాధ్యతని ప్రభాస్ ఎలా నిర్వర్తిస్తాడో చూడాల్సి ఉంది.