Prakash Raj |
తెలుగు సినిమాలపై తనదంటూ ముద్రవేసి, క్యారెక్టర్ ఏదైనా లీనమై నటించగలిగే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. ఈమధ్య కాలంలో ప్రకాష్ రాజ్ చేసిన సినిమా ‘రంగమార్తాండ’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వ్యక్తిపరంగా ప్రకాశ్ రాజ్ మోదీ ప్రభుత్వాన్ని, హిందుత్వ రాజకీయాలను నిత్యం ద్వేషిస్తూ ఉంటాడు.
అలాంటిది ఆయన ఈమధ్య తన భార్యతో కలిసి చేసిన చండీయాగం విషయంగా నెటిజన్ల చేతికి చిక్కినట్లయింది. పైకి నాస్తికుడిగా కబుర్లు చెబుతాడు గానీ లోపల హిందూ సాంప్రదాయంలో పూజలు మాత్రం బాగానే చేస్తాడనే విమర్శలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళితే..
ప్రకాశ్ రాజ్ స్వహస్తాలతో హిందూ దేవతలను ఆరాధిస్తూ చేసిన చండీ యాగం గురించి చాలామందే ఆయన మీద విరుచుకు పడ్డారు. స్త్రీలపై, దళితులపై హిందూ మతంలో వివక్ష ఉందని, నేను నాస్తికుడిని అనే మాటలు ప్రకాశ్ రాజ్ అస్తమానం చెబుతుంటాడు.
అలాంటి వ్యక్తి అయిన ప్రకాశ్ రాజ్ సడెన్‌గా ఇలా యాగాలు చేయడం ఏంటనేది వాళ్ళ ప్రశ్న. సోషల్ మీడియా వేదికగా ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ పోస్ట్‌లు చేయడం కాదు.. ఇప్పుడు మేము కూడా ‘జస్ట్ ఆస్కింగ్’.. ఏంటి ఇదంతా? అంటూ కొందరు నెటిజన్లు చేస్తున్న కామెంట్స్‌కి ప్రకాశ్ రాజ్ వివరణ కూడా ఇచ్చాడు.
నేను నాస్తికుడినే కానీ ఈయాగం చేసింది కేవలం నా భార్యను నొప్పించకూడదని మాత్రమే. మా ఆవిడ మీద గౌరవంతోనే యాగం చేశాను. ఆమె ఇష్టాలను నేను కాదనను. ఆమె కోసం మాత్రమే చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. హుబ్బాలిలోని ఎంవీ గవర్నమెంట్ కాలేజీలో ప్రకాశ్ రాజ్ ఇష్టాగోష్టి మీద కూడా దుమారం లేచింది.
అటు నటన పరంగా ప్రశంసలు, అటు కార్యకర్తగా విమర్శలతో కొనసాగుతున్నాడు ప్రకాశ్ రాజ్. అయితే యాక్టింగ్ పరంగా ఆయన.. అది వరకు ఉన్నంత యాక్టివ్‌గా అయితే లేడనే చెప్పుకోవాలి. మరి అవకాశాలు రావడం లేదో.. లేదంటే.. సేమ్ టు సేమ్ ఒకేలాంటి అవకాశాలు వస్తుండటంతో ఆయన కాదని అనుకుంటున్నాడో తెలియదు కానీ.. ప్రకాశ్ రాజ్ ఇదివరకులా బిజీగా అయితే లేడనే చెప్పుకోవాలి.