Rains | నేడు, రేపు ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం
విధాత: ఉపరితలద్రోణి / గాలి విచ్చిన్నతి ఉత్తర గుజరాత్ నుండి మధ్య మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ. ఎత్తులో కొనసాగుతున్నది.
దీని ప్రభావం వల్ల ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram