Rajinikanth | ఏంటి.. రజనీకాంత్ కూతురు.. ధనుష్ భార్య రెండో పెళ్లికి సిద్ధమైందా?
Rajinikanth | ఇటీవల సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎక్కువగా వింటున్నాం. సమంత- నాగ చైతన్య తర్వాత ధనుష్-ఐశ్వర్యల విడాకులు హాట్ టాపిక్ అయ్యాయి. కోలీవుడ్ స్టార్కపుల్గా 18 ఏళ్లు కలిసి ఉన్న ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ ఊహించని విధంగా ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరిలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. విడాకుల తర్వాత ఐశ్వర్య వెంటనే సోషల్‌మీడియా అకౌంట్లలో తన పేరు చివరన ఉన్న ధనుష్‌ను తొలగించి ఐశ్వర్య రజనీకాంత్‌గా మార్చేసుకుంది. భార్యాభర్తలుగా, […]

Rajinikanth |
ఇటీవల సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎక్కువగా వింటున్నాం. సమంత- నాగ చైతన్య తర్వాత ధనుష్-ఐశ్వర్యల విడాకులు హాట్ టాపిక్ అయ్యాయి. కోలీవుడ్ స్టార్కపుల్గా 18 ఏళ్లు కలిసి ఉన్న ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ ఊహించని విధంగా ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరిలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు.
విడాకుల తర్వాత ఐశ్వర్య వెంటనే సోషల్‌మీడియా అకౌంట్లలో తన పేరు చివరన ఉన్న ధనుష్‌ను తొలగించి ఐశ్వర్య రజనీకాంత్‌గా మార్చేసుకుంది. భార్యాభర్తలుగా, స్నేహితులుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా కలిసి జీవించిన మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం అని ఐశ్వర్య తన పోస్ట్ లో పేర్కొంది.
ధనుష్- ఐశ్వర్యల విడాకులు ప్రతి ఒక్కరికి పెద్ద షాకిచ్చాయి. అయితే ధనుష్ తండ్రి వారిద్దరూ మళ్లీ కలుస్తారని, రజనీకాంత్ మాట్లాడి వాళ్లను తిరిగి ఒక్కటి చేస్తారని ఆ మధ్య చెప్పుకొచ్చారు. దాంతో వాళ్లిద్దరు ఏ రోజుకైన కలవకపోతారా? అని అనుకున్నారు. కాని ఇది జరిగేలా కనిపించడం లేదు. తాజాగా ఐశ్వర్యకు సంబంధించి ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.
అదేంటి అంటే .. ఐశ్వర్య రెండో పెళ్లికి సిద్ధం అయినట్టు తెలుస్తుంది. వరుడు కోలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరో అని, కొద్ది నెలల క్రితమే ఆ హీరోతో ఐశ్వర్య రజనీకాంత్ కి పరిచయం ఏర్పడగా, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని అంటున్నారు. వీరిద్దరు కలిసి త్వరలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్టు కూడా కోలీవుడ్‌లో ప్రచారం నడుస్తుంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియరావడం లేదు.
ఐశ్వర్య రజనీకాంత్ ప్రస్తుతం దర్శకురాలిగా తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంది. ఇక ధనుష్ బాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ధనుష్ ఇటీవల నటించిన స్ట్రెయిట్ తెలుగు చిత్రం సార్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.