అమెరికాలో రామ్ చరణ్ ఇంటర్వ్యూ.. ఇదబ్బా తెలుగోడి దెబ్బ!

విధాత‌, సినిమా: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తెలుగులోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీ. గత మూడు రోజుల నుంచి ఆయన అమెరికాలో బిజీగా గడుపుతున్నాడు. RRR సినిమాతో రేంజ్ ఆమాంతం అంతర్జాతీయ స్థాయికి చేరింది. అమెరికా ప్రముఖ ఛానల్ అమెరికన్ బ్రాడ్ క్యాస్టింగ్ (ABC) కంపెనీలో ప్రసారమయ్యే గుడ్ మార్నింగ్ అమెరికా (GMA)షోకు అతిథిగా వెళ్లారు. ఇందులో సినిమా విషయాలు కాక వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. హాలీవుడ్ సినిమాల్లో నటించాలని ఉందని కోరికను బయట పెట్టారు. […]

  • Publish Date - February 25, 2023 / 12:00 PM IST

విధాత‌, సినిమా: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తెలుగులోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీ. గత మూడు రోజుల నుంచి ఆయన అమెరికాలో బిజీగా గడుపుతున్నాడు. RRR సినిమాతో రేంజ్ ఆమాంతం అంతర్జాతీయ స్థాయికి చేరింది.

అమెరికా ప్రముఖ ఛానల్ అమెరికన్ బ్రాడ్ క్యాస్టింగ్ (ABC) కంపెనీలో ప్రసారమయ్యే గుడ్ మార్నింగ్ అమెరికా (GMA)షోకు అతిథిగా వెళ్లారు. ఇందులో సినిమా విషయాలు కాక వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. హాలీవుడ్ సినిమాల్లో నటించాలని ఉందని కోరికను బయట పెట్టారు.

RRR సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. ఉక్రెయిన్‌లో అందమైన లోకేషన్‌లో షూటింగ్ చేశాం. షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియా వ‌చ్చిన తర్వాత ఒక టూరిస్ట్‌గా మరలా ఉక్రెయిన్‌కి వెళ్లాలని అనుకున్నాను.

కానీ ఈ లోపే వార్ మొదలైంది. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వస్తే ఒక భారతీయుడిగా గర్వపడతాను. ఆస్కార్ అవార్డుల స్థాయికి భారతీయ సినిమాలు వస్తున్నాయి.. చాలా సంతోషకరమైన విషయమిది. సినిమాకు భాష ఉండదు. కేవలం భావోద్వేగాలు మాత్రమే ఉంటాయి. సినిమా నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది.. డాన్స్ చేయిస్తుంది భయపెడుతుంది.. ఇలా అన్నీ చేయిస్తుందని రాజమౌళి చెప్పేవారని గుర్తు చేశారు.

Latest News