Regina | ఛాన్స్ అడిగితే.. అడ్జెస్ట్‌మెంట్‌ కావాలన్నాడు! నాకు తెలియక మేనేజ‌ర్ మీతో మాట్లాడుతాడన్నాను: రెజీనా షాకింగ్ కామెంట్స్

Regina | ఇటీవల సినీ పరిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హీరోయిన్స్, స‌పోర్టింగ్ రోల్స్ చేస్తున్న న‌టీమ‌ణులు చాలా ఓపెన్‌గా మీడియా ముందుకు వ‌చ్చి త‌మ కెరీర్ లో ఎదురైన చేదు అనుభ‌వాల గురించి చెప్పుకొస్తున్నారు. ఇండస్ట్రీలో చాలామందికి ఇలాటి పరిస్థితులు ఎదురైనప్ప‌టికీ, కొందరు మాత్రం కావాలని కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి. కేవలం ఫేమ్ కోసం అబద్ధాలు కూడా చెబుతున్నార‌ని కొంద‌రు అంటున్నారు. అయితే తాజాగా రెజీనా […]

  • Publish Date - August 22, 2023 / 02:36 AM IST

Regina |

ఇటీవల సినీ పరిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హీరోయిన్స్, స‌పోర్టింగ్ రోల్స్ చేస్తున్న న‌టీమ‌ణులు చాలా ఓపెన్‌గా మీడియా ముందుకు వ‌చ్చి త‌మ కెరీర్ లో ఎదురైన చేదు అనుభ‌వాల గురించి చెప్పుకొస్తున్నారు. ఇండస్ట్రీలో చాలామందికి ఇలాటి పరిస్థితులు ఎదురైనప్ప‌టికీ, కొందరు మాత్రం కావాలని కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి.

కేవలం ఫేమ్ కోసం అబద్ధాలు కూడా చెబుతున్నార‌ని కొంద‌రు అంటున్నారు. అయితే తాజాగా రెజీనా చేసిన కాస్టింగ్ కౌచ్ ఓపెన్ కామెంట్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. రెజీనా త‌మిళ అమ్మాయి అయిన‌ప్ప‌టికీ ఈ అమ్మ‌డు తెలుగులో చాలా సినిమాలే చేసింది. ముఖ్యంగా యువ హీరోల‌తో క‌లిసి సంద‌డి చేసింది.

తెలుగులో చివ‌రిగా శాకిని డాకిని అనే సినిమా చేయ‌గా, ఇది కూడా నిరాశ‌ ప‌ర‌చింది. ఆచార్య చిత్రంలో ఓ సాంగ్‌లో మెరిసింది. ఇక్క‌డ రెజీనాకి ల‌క్ లేక‌పోవ‌డంతో త‌మిళంలోనే వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. మ‌రోవైపు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తుంది.

తాజాగా ఈ అమ్మ‌డు ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభ‌వాలు గురించి చెప్పి షాకిచ్చింది. నేను కెరీర్ మొద‌లు పెట్టిన‌ప్పుడు ఛాన్స్ ల కోసం కొందరిని క‌లిసాను. అయితే అప్పుడు ఒక‌త‌ను నాకు కాల్ చేసి సినిమా ఛాన్స్ ఇస్తామ‌ని అన్నాడు. కాక‌పోతే చిన్న కండీషన్ పెట్టాడు.

అడ్జెస్ట్‌మెంట్‌కి ఓకే చెబితే సినిమా ఛాన్స్ ఇస్తామ‌ని అన‌డంతో , నాకు అడ్జ‌స్ట్‌మెంట్ అంటే ఏంటో అర్ధం కాలేదు. అడ్జెస్ట్‌మెంట్ అంటే రెమ్యున‌రేష‌న్ విష‌యంలో అనుకొని, నా మేనేజ‌ర్ మీతో మాట్లాడ‌తాడు అంటూ ఫోన్ క‌ట్ చేశాను. ఆ త‌ర్వాత నా మేనేజర్ అడ్జెస్ట్‌మెంట్ అంటే ఏంటో చెప్ప‌డంతో షాక‌య్యాను అని రెజీనా పేర్కొంది.

త‌న‌కు 20 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు జ‌రిగిన సంఘ‌ట‌న ఇది అని రెజీనా చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం రెజీనా చేసిన వ్యాఖ్య‌లు అంత‌టా చ‌ర్చనీయాంశంగా మారాయి. అయితే ఇంత‌కు రెజీనాని అడ్జెస్ట్‌మెంట్ అడిగిన వ్య‌క్తి ఎవ‌ర‌నేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్ గానే ఉంది

Latest News