Aishwarya Rajesh | న‌న్ను ఆ ద‌ర్శ‌కుడు నైటీలో చూడాల‌ని అన్నాడు.. ద‌ర్శ‌కుడి ప్ర‌వ‌ర్త‌న‌తో విసిగిపోయాన‌న్న హీరోయిన్

Aishwarya Rajesh | తెలుగు ప్రేక్షకులకు పెద్ద పరిచయం లేకపోయినా, తమిళ ఇండస్ట్రీలో తమ ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్, రీసెంట్‌గా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ద్వారా పెద్ద హిట్ అందుకుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది.

  • By: sn |    movies |    Published on : Jan 31, 2026 10:35 AM IST
Aishwarya Rajesh | న‌న్ను ఆ ద‌ర్శ‌కుడు నైటీలో చూడాల‌ని అన్నాడు.. ద‌ర్శ‌కుడి ప్ర‌వ‌ర్త‌న‌తో విసిగిపోయాన‌న్న హీరోయిన్

Aishwarya Rajesh | తెలుగు ప్రేక్షకులకు పెద్ద పరిచయం లేకపోయినా, తమిళ ఇండస్ట్రీలో తమ ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్, రీసెంట్‌గా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ద్వారా పెద్ద హిట్ అందుకుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ భాగ్యలక్ష్మి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకులను అలరించింది. అయితే సినిమా సక్సెస్ అయినప్పటికీ, టాలీవుడ్ నుంచి పెద్ద అవకాశాలు లభించకపోవడం ఆమెకు నిరాశగా ఉంది. ఈ నేపథ్యంలో, తాజాగా ఐశ్వర్య రాజేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని పంచుకుంది.

ఈ ఇంటర్వ్యూలో ఐశ్వర్య మాట్లాడుతూ, “నా కెరీర్ ప్రారంభంలో ఒక సినిమా ఆడిషన్‌కు వెళ్లినప్పుడు ఆ డైరెక్టర్ నన్ను నైట్ డ్రెస్సులో కనిపించమని అడిగాడు. ఎందుకంటే అతను నా బాడీ చూడాలని కోరుకున్నాడు. ఆ సమయంలో నాకు చాలా కోపం వచ్చింది. తరువాత , ఇలా ఎంతమందిని అడిగి ఉంటాడో అనిఆలోచించటం వల్ల మరింత బాధగా అనిపించింది” అని తెలిపింది. ఈ సంఘటనపై తన అనుభవాలను చెబుతూ, ఐశ్వర్య రాజేష్ ఆ దర్శకుడి పేరును వెల్లడించలేదు. ఆమె ఇలా చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారి వైరల్ అవుతోంది.

ఇంటర్వ్యూలో ఐశ్వర్య తన తండ్రి, కుటుంబం, కెరీర్ ప్రారంభం వంటి అంశాలపై కూడా మాట్లాడింది. తన ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, ఇండస్ట్రీలో మహిళలకు ఎదురవ్వాల్సిన పరిస్థితులపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.అయితే, ఈ ఇంటర్వ్యూతో ఒక స్పష్టమైన సందేశం వచ్చింది. పెద్ద విజయాలను సాధించినా, సక్సెస్ మధ్యన కూడా మహిళలు పరిశ్రమలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే వాస్తవం. ఐశ్వర్య రాజేష్ నిజాయితీగా తన అనుభవాన్ని పంచుకోవడం, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు మారింది.