Indian Railways | రైలు చివరి బోగీపై ‘X’ గుర్తు.. చాలామందికి తెలియని భారతీయ రైల్వే సీక్రెట్!

Indian Railways | రైలు చివరి బోగీపై 'X' గుర్తును ఎప్పుడైనా గమనించారా? దాన్ని యాదృచ్చికంగానే వేశారా? లేదా దాని వెనుక ఏదైనా కారణం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం గుర్తు మాత్రమే కాదు.. రైల్వే భద్రతా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని తెలుసా!

Indian Railways | రైలు చివరి బోగీపై ‘X’ గుర్తు.. చాలామందికి తెలియని భారతీయ రైల్వే సీక్రెట్!

Indian Railways | రైలు ప్రయాణం చేసేటప్పుడు మనం రకరకాల సింబల్స్‌ను చూస్తుంటాం. వాటిలో ముఖ్యంగా రైలు చివరి బోగిపై చాలా పెద్దగా ‘X’ అనే గుర్తు ఉంటుంది. మరి ఈ ‘X’ గుర్తు యాదృచ్చికంగానే వేశారా? లేదా దాని వెనుక ఏదైనా కారణం ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి ఇది కేవలం గుర్తు మాత్రమే కాదు.. రైల్వే భద్రత, ఆపరేషన్లలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని తెలుసా!

రైలు వెనుక బోగిపై తెలుపు లేదా పసుపు రంగులో ఉండే ‘X’ గుర్తు ఒక ముఖ్యమైన సంకేతం. ఇది రైలు పూర్తిగా రైల్వే స్టేషన్‌ను దాటి వెళ్లిందని సిబ్బందికి తెలిసేందుకు వినియోగిస్తుంటారు. రైల్వే సిబ్బంది చివరి బోగిని గమనించినప్పుడు ‘X’ గుర్తు కనిపిస్తే.. రైలు సురక్షితంగా స్టేషన్ దాటిందని నిర్ధారిస్తారు. ఆ గుర్తు కనిపించకపోతే రైలు బోగీలు విడిపోయి ఉంటాయని గుర్తిస్తారు. వెంటనే ఆ సమాచారాన్ని తదుపరి స్టేషన్లకు తెలియజేసి, ప్రమాదాలను నివారిస్తారు.

ప్రమాదాల నివారణలో కీలకం!

ఇంకా వివరంగా చెప్పాలంటే.. రైలు ప్రయాణంలో ఉండగా అప్పుడప్పుడు బోగీలు విడిపోయి ప్రమాదాలు జరుగుతుంటాయి. అలా బోగీలు వేరుపడినప్పుడు లోకోపైలట్‌కు వెంటసే సమస్య తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. అదే రైలు చివరి బోగీ మీద ‘X’ గుర్తు ఉంటే.. ఒక స్టేషన్ నుంచి రైలు వెళ్తున్నప్పుడు అక్కడి సిబ్బంది రైలు చివరి బోగిని గమనిస్తారు. అప్పుడు ‘X’ సింబల్ కనిపిస్తే రైలు సురక్షితంగా స్టేషన్ దాటి వెళ్తుందని నిర్ధారించుకుంటారు.

అదే ‘X’ గుర్తు కనబడకపోతే రైలు చివరి బోగీలు ఎక్కడో విడిపోయినట్లుగా సిబ్బంది గుర్తిస్తారు. వెంటనే రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటారు. దీని ద్వారా రైలు‌కు ఏ ప్రాంతంలో సమస్య వచ్చింది? ఎక్కడ బోగీ విడిపోయిందనే విషయాలను చాలా త్వరగా గుర్తిస్తారు. తద్వారా ఆ రైలును వెంటనే ఆపుతారు. అలాగే ముందు స్టేషన్లను అలర్ట్ చేసి, వెనుక వచ్చే రైళ్లను కూడా నిలిపివేసి ప్రమాదాలను నివారించవచ్చు.

రాత్రిళ్లూ కనిపించేలా రేడియం పెయింట్

ఇది ముఖ్యంగా రాత్రి సమయాల్లో, పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు, తక్కువ విజిబిలిటీ ఉన్న ప్రాంతాల్లో రైల్వే సిబ్బందికి ఎంతగానో సహాయపడుతుంది. అయితే అలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ‘X’ సింబల్ స్పష్టంగా కనిపించడానికి ప్రత్యేకమైన పెయింట్‌ను వాడుతారు. రిఫ్లెక్టివ్ లేదా రేడియం పెయింట్‌ను వినియోగిస్తారు.

మరో రెండు సూచనలు కూడా!

రైలులో చివరి బోగీని గుర్తించడానికి ‘X’ సింబల్ మాత్రమే కాకుండా మరికొన్ని సూచనలు కూడా ఉంటాయి. అందులో ఒకటి LV బోర్డు.. దీని అర్థం Last Vehicle. ఈ గుర్తును చూసి కూడా చివరి బోగీని గుర్తించవచ్చు. అలాగే భద్రత కోసం చివరి బోగీకి రెడ్ టెయిల్ ల్యాంప్‌ను అమరుస్తారు. ఇది నిరంతరం వెలుగుతూ ఉంటుంది. దీనిద్వారా కూడా రైలు సురక్షితంగా రైల్వే స్టేషన్‌ను దాటుతుందని గుర్తిస్తారు. ఇలా ‘X’ గుర్తుతో పాటు LV, రెడ్ టెయిల్ ల్యాంప్‌‌లు భారతీయ రైల్వేలో భద్రత వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంటాయి.

Read More:

నెలకు 85 వేల ఇచ్చి నా భర్తను నువ్వే ఉంచుకో.. ప్రియురాలికి షాకింగ్ ఆఫర్ ఇచ్చిన భార్య !

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ ఎలా తయారు చేస్తారో తెలుసా! వైరల్ వీడియో చూసేయండి!