Niharika | నిహారిక‌ను తిట్టిన ఆక‌తాయి.. నోరు మూసుకో అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తేజ్

Niharika | మెగా డాట‌ర్ నిహారిక‌పై అంద‌రికి సాఫ్ట్ కార్నర్ ఉండేది. ఎప్పుడైతే తాను డైవ‌ర్స్ తీసుకుందో అప్ప‌టి నుండి ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. విడాకుల విష‌యంలో త‌ప్పంతా త‌న‌దే అన్న‌ట్టుగా తిట్టిపోస్తున్నారు. అయితే నిహారిక ఇవ‌న్నీ ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళుతుంది. విడాకుల త‌ర్వాత కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టిన ఈ అమ్మ‌డు ఒక‌వైపు న‌టిగా, మ‌రోవైపు నిర్మాత‌గా రాణించే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఇక ఫ్రెండ్స్ తో స‌ర‌దాగా షికారుల‌కి వెళుతుంది. […]

  • By: sn    latest    Aug 20, 2023 6:15 PM IST
Niharika | నిహారిక‌ను తిట్టిన ఆక‌తాయి.. నోరు మూసుకో అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తేజ్

Niharika |

మెగా డాట‌ర్ నిహారిక‌పై అంద‌రికి సాఫ్ట్ కార్నర్ ఉండేది. ఎప్పుడైతే తాను డైవ‌ర్స్ తీసుకుందో అప్ప‌టి నుండి ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. విడాకుల విష‌యంలో త‌ప్పంతా త‌న‌దే అన్న‌ట్టుగా తిట్టిపోస్తున్నారు. అయితే నిహారిక ఇవ‌న్నీ ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళుతుంది. విడాకుల త‌ర్వాత కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టిన ఈ అమ్మ‌డు ఒక‌వైపు న‌టిగా, మ‌రోవైపు నిర్మాత‌గా రాణించే ప్ర‌య‌త్నం చేస్తుంది.

ఇక ఫ్రెండ్స్ తో స‌ర‌దాగా షికారుల‌కి వెళుతుంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్ప‌టికప్పుడు త‌నకి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ వ‌స్తుంది. అయితే రీసెంట్‌గా నిహారిక త‌న బావ సాయిధ‌ర‌మ్ తేజ్ పోస్ట్‌కి కామెంట్ పెట్ట‌గా, ఓ ఆక‌తాయి ఆమెపై దారుణ‌మైన కామెంట్ చేశాడు. దీనికి సాయిధ‌ర‌మ్ తేజ్ దిమ్మ‌తిరిగే వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్.. బైక్ ప్ర‌మాదం నుండి కోలుకున్న త‌ర్వాత విరూపాక్ష అనే చిత్రంతో రీఎంట్రీ ఇవ్వ‌గా, ఈ మూవీ పెద్ద విజ‌యం సాధించింది. ఇదే ఉత్సాహంతో త‌న మావ‌య్య ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి బ్రో అనే సినిమా చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టిన తన మామ ప‌వ‌న్‌తో కలిసి న‌టించిన సంతోషం అయితే తేజ్‌కి ఉంది.

ఇక కొన్ని రోజుల వ‌ర‌కు తేజ్ సినిమాల‌కి దూరంగా ఉండ‌బోతున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యంపై దృష్టి పెట్టాల‌ని భావిస్తున్న తేజ్ ఆరు నెల‌ల త‌ర్వాతే త‌న త‌దుప‌రి సినిమా షూటింగ్ మొద‌లు పెట్ట‌నున్నాడు. అయితే బ్రో త‌ర్వాత తేజ్ త‌న స్నేహితుడు, సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయకృష్ణ కోసం ఓ ప్రయివేట్ సాంగ్ లో నటించాడు.

స్వాతి రెడ్డితో కలసి సత్య అనే వీడియో సాంగ్ లో తేజ్ న‌టించ‌గా, దీనికి సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌స్తుంది. అయితే ఈ సాంగ్‌కి సంబంధించిన అప్‌డేట్ ని కొద్ది రోజుల క్రితం తేజ్ త‌న ఇన్‌స్టాలో ఇవ్వ‌గా, దానికి నిహారిక‌.. సాంగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ కామెంట్ పెట్టింది.

నిహారిక కామెంట్‌కి స్పందించిన ఓ ఆక‌తాయి.. వీటిపైన పెట్టిన దృష్టి ఫ్యామిలీపై పెట్టుంటే బావుండేది అని ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి ప్రస్తావించాడు. దీనితో సాయిధరమ్ తేజ్ ఫుల్ ఫైర్ అవుతూ.. ముందు నోరు మూసుకొని ఆ కామెంట్ డిలీట్ చేయి అన్నాడు. దాంతో స‌ద‌రు నెటిజ‌న్ కామెంట్ డిలీట్ చేశాడు. మ‌ర‌ద‌లి కోసం బావ చేసిన ప‌ని ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.