చావు అంచులు చూసొచ్చి.. మళ్లీ 100 స్పీడ్‌తో సాయిధరమ్ తేజ్ ఫీట్లు!
విధాత, సినిమా: పొలం గట్లు అంటే ఎలా ఉంటాయో చాలా మందికి తెలుసు.. మెయిన్ రోడ్డులే గతుకుల మయంగా ఉన్న ఈ రోజుల్లో పొలంగట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైవేలే ఇప్పుడు గుంతలతో నిండి ఉన్నాయి.. అలాంటిది పొలం గట్లు అంటే ఎలా ఉంటాయి? రోడ్లు సాఫీగా ఉండవు మట్టి రోడ్లపై ప్రయాణం చేయాల్సి వస్తుంది. అలాంటి మట్టి రోడ్లపై, పొలం గట్లపై 100 స్పీడుతో బైక్ నడపడం అనేది కష్టంతో కూడుకున్న వ్యవహారం. […]

విధాత, సినిమా: పొలం గట్లు అంటే ఎలా ఉంటాయో చాలా మందికి తెలుసు.. మెయిన్ రోడ్డులే గతుకుల మయంగా ఉన్న ఈ రోజుల్లో పొలంగట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైవేలే ఇప్పుడు గుంతలతో నిండి ఉన్నాయి.. అలాంటిది పొలం గట్లు అంటే ఎలా ఉంటాయి? రోడ్లు సాఫీగా ఉండవు మట్టి రోడ్లపై ప్రయాణం చేయాల్సి వస్తుంది.
అలాంటి మట్టి రోడ్లపై, పొలం గట్లపై 100 స్పీడుతో బైక్ నడపడం అనేది కష్టంతో కూడుకున్న వ్యవహారం. అందులోనూ ఒకసారి యాక్సిడెంట్ జరిగి చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన వారికి ఆ స్పీడులో పొలం కట్లపై బైక్ నడపాలంటే భయపడతారు.. కానీ సాయిధరమ్ తేజ్ మాత్రం ‘విరూపాక్ష’ సినిమాలో ఇలాంటి రిస్కీ బైక్ సీక్వెన్స్‌లో భాగంగా నడిపారు.
2021 సెప్టెంబర్ 10వ తేదీ సాయితేజ్‌కి ఒక పీడకల. ఆ రోజున బైక్‌పై వేగంగా వస్తున్న సాయిధరమ్ తేజ్ బైక్ స్కిడ్ అయింది. దాదాపు చనిపోయే పరిస్థితుల వరకు వెళ్లి.. దేవుడి దయ, మేనమామల, అభిమానుల ప్రేమ ఆయనని కోలుకునేలా చేసింది. అంత ప్రమాదం జరిగిన మళ్లీ బైక్ ఎక్కాలంటే ఆలోచిస్తారు.వేగంగా వెళ్లడానికి వెనుకాడతారు.
కానీ సాయిధరమ్ తేజ్ అందుకు భిన్నంగా ఉన్నాడు. సినిమాలో ఒక సీన్ కోసం తన జీవితాన్నే రిస్క్ లో పెట్టారు మేకర్స్.. డూప్‌ని పెడదాం అన్నా సరే ఒప్పుకోలేదు. ఎంత రిస్క్ అయినా పర్లేదు నేనే చేస్తానని ఆ రిస్కీ సీన్స్ చేశాడట. సాయి తేజ్ ధైర్యాన్ని చూసి ప్రశంసించకుండా ఉండలేకపోయారు మేకర్స్.
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమాలో రిస్కీ బైక్ సీన్స్‌ను ఎలాంటి భయం లేకుండా చేసి.. సర్ప్రైజ్ చేశారు. మన మనసులను గెలుచుకున్నారు అని ఆ చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ఈ చిత్ర దర్శకుడు కార్తీక్ దండు మాట్లాడుతూ సెప్టెంబర్ 10న సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ జరిగి వచ్చిన తర్వాత ఎవరికైనా భయం అనేది ఉంటుంది.
ఒక చిన్న చెరువు కట్ట, ఒకవైపు పెద్ద చెరువు.. మరోవైపు పెద్ద లోయ. ఆ కట్ట మీద 100 స్పీడ్‌లో బైక్ డ్రైవ్ చేసుకుని వచ్చి సడన్‌గా బ్రేక్ కొట్టాలి. అలా చేయడం ఎవరికైనా రిస్కే కానీ సాయిధరమ్ తేజ్ ఆ స్టంట్‌ని సింగల్ టేక్‌లో పూర్తి చేశారు అని దర్శకుడు చెప్పుకొచ్చారు.
సినిమాటోగ్రాఫర్ మాట్లాడుతూ.. యాక్సిడెంట్ అయిన తర్వాత షూట్‌కి వచ్చారు.. అయితే రిస్కీ బైక్ సీన్.. నువ్వు వద్దు, డూప్‌ని పెట్టి మేనేజ్ చేస్తామంటే ఒప్పుకోలేదు. పర్లేదు నేనే చేస్తా అన్నారు. తనలోని భయాన్ని అధిగమించాలని సాయిధరమ్ తేజ్ అన్నారు.
తనలో ఉన్న భయాన్ని జయించడం కోసం ఈ రిస్కీ బైక్ సీక్వెన్స్ చేశారు. అతను ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నాను. వంద స్పీడులో బైక్ నడపడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ సడన్ బ్రేక్ వేయాలి. సాయిధరమ్ తేజ్‌కి డూప్ పెట్టుకునే అవకాశం ఉన్నా కూడా పెట్టుకోకుండా రిస్క్ చేశాడు.. ఇది తెలిసి అతని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అందుకే అనేది.. ఊరికినే స్టార్ అయిపోతారా? ఇలాంటివి చేస్తేనే కదా.. అంతేగా!