Ms Dhoni | ధోని.. ఆ రోజే రిటైర్మెంట్ తీసుకోవడానికి అసలు కారణం చెప్పిన సాక్షి
Ms Dhoni | మహేంద్ర సింగ్ ధోని.. కోట్లాది అభిమానుల కలలని తీర్చిన గొప్ప కెప్టెన్. 1983 తర్వాత వరల్డ్ కప్ కోసం భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో సిక్సర్ కొట్టి 2011 వరల్డ్ కప్ భారత్ ఖాతాలోకి వచ్చేలా చేశాడు. ఇదే కాక ధోని కెప్టెన్సీలో రెండు ఐసీసీ ట్రోఫీలు కూడా ఇండియాకి దక్కాయి. మంచి ఆటగాడిగానే కాకుండా గొప్ప కెప్టెన్‌గా అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న ధోని.. కోట్లాది మంది అభిమానులకు షాక్ […]

Ms Dhoni |
మహేంద్ర సింగ్ ధోని.. కోట్లాది అభిమానుల కలలని తీర్చిన గొప్ప కెప్టెన్. 1983 తర్వాత వరల్డ్ కప్ కోసం భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో సిక్సర్ కొట్టి 2011 వరల్డ్ కప్ భారత్ ఖాతాలోకి వచ్చేలా చేశాడు. ఇదే కాక ధోని కెప్టెన్సీలో రెండు ఐసీసీ ట్రోఫీలు కూడా ఇండియాకి దక్కాయి.
మంచి ఆటగాడిగానే కాకుండా గొప్ప కెప్టెన్‌గా అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న ధోని.. కోట్లాది మంది అభిమానులకు షాక్ ఇస్తూ.. 2020లో సరిగ్గా 19.29 గంటలకు ఆగస్ట్ 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు. ధోని తీసుకున్న నిర్ణయం చాలా మందికి షాకిచ్చింది.
ధోనికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని చాలా మంది అనుకున్నా కూడా ఆయన సోషల్ మీడియా ద్వారా తన రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే ఇండిపెండెన్స్ డే రోజునే ఎంఎస్ ధోని ఎందుకు క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు..? అనే విషయం మొన్నటి వరకు సస్పెన్స్‌గా ఉంది. అయితే దీని వెనక ఉన్న సీక్రెట్‌ని తాజాగా ధోని భార్య సాక్షి తెలియజేశారు.
ఆగస్టు 15న ధోని తల్లి దేవకీ దేవి పుట్టినరోజు, ఆమెతో ధోనికి చాలా మంచి బాండింగ్ ఉంటుంది. తల్లిని ఎంతో ప్రేమించే ధోని ఆమె బర్త్ డే రోజు రిటైర్మెంట్ ఇవ్వాలని భావించి కీలక ప్రకటన చేశారని సాక్షి పేర్కొంది. ఇక మంగళవారం తన అత్తగారు దేవకి బర్త్ డే కాగా, ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతూ ఫొటోలను పంచుకున్నారు సాక్షి.
ఇక జూలై 7, 1981న జన్మించిన ఎంఎస్ ధోనీ.. పాన్ సింగ్ ధోని, దేవకీ దేవి దంపతుల చిన్న కుమారుడు. ధోనికి అన్న నరేంద్ర సింగ్ ధోని, అక్క జయంతి గుప్తా ఉన్నారు. అత్తగారితో తనకి మంచి బాండింగ్ ఉందని సాక్షి అంటుంది. వివాహమైన తొలినాళ్లలో ధోని కుటుంబంతో తాను ఎలా అల్లరి చేసిందో ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.
మేమిద్దరం కూడా స్నేహితుల మాదిరిగా ఉంటామని, అన్ని కూడా షేర్ చేసుకుంటామని పేర్కొంది సాక్షి. తనకు ప్రతి విషయంలో కూడా దేవకి మద్దతునిస్తుందని సాక్షి స్పష్టం చేసింది. ఇక ధోని ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతుండగా, వచ్చే ఏడాది అతనికి ఐపీఎల్ సీజన్ అని తెలుస్తుంది.