బీఆరెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావులు కాంగ్రెస్‌లో చేరారు. వారు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు
విధాత, హైదరాబాద్ : బీఆరెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావులు కాంగ్రెస్‌లో చేరారు. వారు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి వారిని పార్టీలోకి రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నిజమాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జా తదితరులు పాల్గొన్నారు. బీఆరెస్ నేతలు ఒక్కోక్కరు కారు దిగిపోతు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. నిన్న బోథ్, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, చిలుముల మధన్‌రెడ్డిలు కాంగ్రెస్‌లో చేరారు.