Scorpion Farming | తేళ్ల వ్య‌వ‌సాయం.. విషం లీటరు 82 కోట్లకు పైనే

Scorpion Farming | వినూత్నంగా ఆలోచిస్తే డ‌బ్బులు ఎంత ఎక్కువ‌గా సంపాదించొచ్చో చాటిచెప్పే తాజా ఉదాహ‌ర‌ణ ఇది. ఎవ‌రైనా వ్య‌వ‌సాయం అంటే ప‌ళ్లు, ధాన్యాలు పండిస్తారు. కొంత మంది ఆక్వాలు, పాడి అంటూ ఆలోచిస్తారు. కానీ ఒక వ్య‌క్తి మాత్రం ప్ర‌మాద‌క‌ర‌మైన పెద్ద పెద్ద తేళ్ల‌ను పెంచుతున్నాడు. ఈ ప‌రిశ్ర‌మ‌కు తేళ్ల వ్య‌వ‌సాయం (Scorpion Farming) అని నామ‌క‌ర‌ణం కూడా చేసేసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేశాడు. కొన్ని ల‌క్ష‌ల తేళ్ల‌ను త‌ను ఉన్న ప్ర‌దేశంలో వ‌దులులూ.. వ్య‌వ‌సాయం […]

  • By: krs    latest    Sep 04, 2023 10:57 AM IST
Scorpion Farming | తేళ్ల వ్య‌వ‌సాయం.. విషం లీటరు 82 కోట్లకు పైనే

Scorpion Farming |

వినూత్నంగా ఆలోచిస్తే డ‌బ్బులు ఎంత ఎక్కువ‌గా సంపాదించొచ్చో చాటిచెప్పే తాజా ఉదాహ‌ర‌ణ ఇది. ఎవ‌రైనా వ్య‌వ‌సాయం అంటే ప‌ళ్లు, ధాన్యాలు పండిస్తారు. కొంత మంది ఆక్వాలు, పాడి అంటూ ఆలోచిస్తారు. కానీ ఒక వ్య‌క్తి మాత్రం ప్ర‌మాద‌క‌ర‌మైన పెద్ద పెద్ద తేళ్ల‌ను పెంచుతున్నాడు. ఈ ప‌రిశ్ర‌మ‌కు తేళ్ల వ్య‌వ‌సాయం (Scorpion Farming) అని నామ‌క‌ర‌ణం కూడా చేసేసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేశాడు.

కొన్ని ల‌క్ష‌ల తేళ్ల‌ను త‌ను ఉన్న ప్ర‌దేశంలో వ‌దులులూ.. వ్య‌వ‌సాయం చేస్తున్నాడు. వాటిని ప‌ట్టుకుని అవి ఆరోగ్యంగా ఉన్నాయో లేదో చూసి వ‌దిలిపెడుతున్న‌ట్లు వీడియోలో క‌నిపిస్తోంది. ఈ ర‌క‌మైన వ్య‌వ‌సాయం కూడా ఉందా… అని మ‌రికొంద‌రు, తెలివైన, ధైర్య‌మైన‌ నిర్ణ‌యం అని మ‌రికొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.

తేళ్ల‌ను పెంచితే ఏమొస్తుంది అని ఆలోచిస్తున్నారా? దీనికి స‌మాధానం తెలియాలంటే పాము లేదా విష‌పూరిత జీవి ఏదైనా క‌రిస్తే మ‌నకి వైద్యుడు ఇచ్చే మందు వీనం. విషానికి విరుగుడైన ఈ వీనంను విషం నుంచే త‌యారు చేస్తారు. ప్ర‌స్తుతం తేళ్ల సాగు చేస్తున్న ఈ వ్యక్తి కూడా వాటి నుంచి విషాన్ని సేక‌రించడానికే ఈ ప‌ని చేస్తున్నాడు. మార్కెట్లో ఈ విషం ధ‌ర కొద్ది మొత్తంలోనే ల‌క్షల్లో ప‌లుకుతుంది.

ఒక అంచ‌నా ప్ర‌కారం ఒక గ్యాల‌న్ తేలు విషం.. 39 ల‌క్ష‌ల డాల‌ర్ల వ‌ర‌కు ప‌లుకుతుంది. అంటే మన రూపాయలలో లీటరు విషం రూ.82 కోట్లకు పైపెచ్చు పలుకుతుంది. అందుకే దీనిని ప్ర‌పంచంలోనే అరుదైన ద్ర‌వంగా చెబుతారు. ఒక గ్యాల‌న్ విషాన్ని సేక‌రించాలంటే 2.64 మిలియ‌న్ తేళ్ల నుంచి ఒక సారి విషాన్ని సేక‌రించాల్సి ఉంటుంది. దీనిని ముందుగానే చెప్పిన‌ట్లు వీనం త‌యారీ లోనూ, క్యాన్స‌ర్ క‌ణాలను గుర్తించ‌డంలోనూ, మ‌లేరియాను నిర్మూలించే మందుల్లోనూ విరివిగా ఉప‌యోగిస్తారు.