Secunderabad-Agartala Express | సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరిన రైలు బోగీలో పొగలు

అగర్తల వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు ఒడిశాలోని బరంపురంలో బ్రేక్‌ ఏసీ యూనిట్‌లో సమస్యతో పొగ వెంటనే కంట్రోల్‌ చేసిన సిబ్బంది భయపడిపోయిన ప్రయాణికులు మరో రైలులో పంపాలంటూ వినతి విధాత‌: సాధారణంగా రైలు ప్రమాదాలో, బస్సు ప్రమాదాలో జరిగినప్పుడు, అందులోనూ అవి తీవ్ర స్థాయి ఘటనలు అయినప్పుడు ప్రయాణికుల్లో భయం ఎంతో కొంత ఉంటుంది. అందులోనూ ఒడిశా రైలు ప్రమాదం అనంతరం అదే రాష్ట్రంలో గూడ్స్‌ పట్టాలు తప్పింది. ఆ మరుసటి రోజే మంగళవారం సికింద్రాబాద్‌ నుంచి […]

  • By: Somu    latest    Jun 06, 2023 11:37 AM IST
Secunderabad-Agartala Express | సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరిన రైలు బోగీలో పొగలు
  • అగర్తల వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు
  • ఒడిశాలోని బరంపురంలో బ్రేక్‌
  • ఏసీ యూనిట్‌లో సమస్యతో పొగ
  • వెంటనే కంట్రోల్‌ చేసిన సిబ్బంది
  • భయపడిపోయిన ప్రయాణికులు
  • మరో రైలులో పంపాలంటూ వినతి

విధాత‌: సాధారణంగా రైలు ప్రమాదాలో, బస్సు ప్రమాదాలో జరిగినప్పుడు, అందులోనూ అవి తీవ్ర స్థాయి ఘటనలు అయినప్పుడు ప్రయాణికుల్లో భయం ఎంతో కొంత ఉంటుంది. అందులోనూ ఒడిశా రైలు ప్రమాదం అనంతరం అదే రాష్ట్రంలో గూడ్స్‌ పట్టాలు తప్పింది. ఆ మరుసటి రోజే మంగళవారం సికింద్రాబాద్‌ నుంచి అగర్తల (Secunderabad-Agartala Express) వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలో పొగలు రావడాన్ని మంగళవారం మధ్యహ్నం సమయంలో ప్రయాణికులు గుర్తించి, సిబ్బందిని అప్రమత్తం చేశారు.

ఏసీ యూనిట్‌లో కలిగిన ఇబ్బంది కారణంగా పొగలు వచ్చినట్టు గుర్తించిన సిబ్బంది.. వెంటనే సమస్యలను సరిచేశారు. అయితే.. ఈ ఘటన కూడా ఒడిశాలోనే జరిగింది. ఆ సమయంలో రైలు బరంపురం వద్ద ఉన్నది. ఈ ఘటనతో భయపడిపోయిన ప్రయాణికులు పొగలు వచ్చిన కోచ్‌లో ప్రయాణించేది లేదని, తమను వేరే కోచ్‌లోకి మార్చాలని భీష్మించారు.