సికింద్రాబాద్ పార్ల‌మెంట్ బీఆరెస్ అభ్య‌ర్థి పద్మారావు గౌడ్‌

బీఆరెస్ పార్టీ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తోంది. ఇప్ప‌టికే 13 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన గులాబి బాస్ తాజాగా సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి మాజీమంత్రి, ప్రస్థుత శాసన సభ్యుడు తిగుళ్ల పద్మారావు గౌడ్‌ను ప్ర‌క‌టించారు

  • By: Somu    latest    Mar 23, 2024 10:53 AM IST
సికింద్రాబాద్ పార్ల‌మెంట్ బీఆరెస్ అభ్య‌ర్థి పద్మారావు గౌడ్‌
  • ప్ర‌క‌టించిన గులాబీ బాస్‌

విధాత‌: బీఆరెస్ పార్టీ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తోంది. ఇప్ప‌టికే 13 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన గులాబి బాస్ తాజాగా సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి మాజీమంత్రి, ప్రస్థుత శాసన సభ్యుడు తిగుళ్ల పద్మారావు గౌడ్‌ను ప్ర‌క‌టించారు.


ఈ మేరకు పార్టీ శాసన సభ్యులు ప్రజాప్రతినిధులు ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్ల‌డించారు. పార్టీ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా వున్న పద్మారావు గౌడ్ అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారు.

కాగా.. అందరి ఏకాభిప్రాయం మేరకు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ ను బరిలోకి దింపాలని బీఆరెస్‌ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. భువ‌న‌గిరి స్థానానికి క్యామ మ‌ల్లేష్‌, నల్ల‌గొండ స్థానానికి కంచ‌ర్ల కృష్ణారెడ్డిని ప్ర‌క‌టించారు. ఇక హైద‌రాబాద్ స్థాన‌మొక్క‌టే ప్ర‌క‌టించాల్సి ఉన్న‌ది.