Shabbir Ali | అమిత్ షా వాఖ్యలపై సుప్రీంకోర్టులో పిటిష‌న్‌ వేస్తా: షబ్బీర్‌ అలీ

Shabbir Ali దేశంలో బీజేపీ రాజ్యంగం నడుస్తుందా? ముస్లింల రిజర్వేషన్లను తొలగించడం అమిత్‌ షా తరం కాదు మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ హైదరాబాద్‌, విధాత: ముస్లింలకు రిజర్వేషన్లు తొలగిస్తానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. అధికార బీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌, బీఎస్‌పీ తదితర పార్టీలు, ప్రజా సంఘాలు హోం మంత్రి అమిత్‌షా ఆదివారం చేవెళ్లలో జరిగిన బహిరంగ సభలో చేసిన వాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. […]

Shabbir Ali | అమిత్ షా వాఖ్యలపై సుప్రీంకోర్టులో పిటిష‌న్‌ వేస్తా: షబ్బీర్‌ అలీ

Shabbir Ali

  • దేశంలో బీజేపీ రాజ్యంగం నడుస్తుందా?
  • ముస్లింల రిజర్వేషన్లను తొలగించడం అమిత్‌ షా తరం కాదు
  • మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ

హైదరాబాద్‌, విధాత: ముస్లింలకు రిజర్వేషన్లు తొలగిస్తానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. అధికార బీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌, బీఎస్‌పీ తదితర పార్టీలు, ప్రజా సంఘాలు హోం మంత్రి అమిత్‌షా ఆదివారం చేవెళ్లలో జరిగిన బహిరంగ సభలో చేసిన వాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

దేశంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం నడుస్తోందా? లేక బీజేపీ రాజ్యాంగం నడుస్తోందా? అని ప్రశ్నిస్తున్నాయి. అమిత్‌ షా వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనమని అంటున్నాయి. దేశంలో ప్రజలను మతాలవారిగా చీల్చడానికి చిచ్చు పెడుతున్నాయని ఆరోపించాయి. అమిత్ షా వాఖ్యలపై సుప్రీంకోర్టులో పిటీషన్ వేయడానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్దమవుతున్నది.

మతాల సెంటిమెంట్‌ను రగిల్చి ఎన్నికల్లో లబ్ది పొందడానికి బీజేపీ అడ్డగోలుగా వ్యవహరిస్తుందని అంటున్నారు. బీజేపీ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ సీరియస్‌గా తీసుకున్నది. ఈ మేరకు పార్టీ నేతలు షబ్బీర్‌ అలీ (Shabbir Ali), మల్లు రవి, నిరంజన్‌లు గాంధీ భవన్‌ వేదికగా తమ నిరసనను వ్యక్తం చేశారు.

దేశంలో అంబేద్కర్ రాజ్యంగం నడుస్తుందా… లేక బీజేపీ రాజ్యంగం నడుస్తుందా? అని సీనియర్‌ కాంగ్రెస్‌నేత మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ప్రశ్నించారు. కేంద్ర హోం మంత్రిగా అమిత్‌షా అనర్హుడని అన్నారు. సోమవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామనడం బీజేపీ ఆహంకానికి నిదర్శనమన్నారు. మత పరమైన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు చెప్పింది కానీ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా సూచించిందని తెలిపారు.

తమ ప్రభుత్వం వెనకబడిన ముస్లింలకు మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చిందని గుర్తు చేశారు. అలాంటప్పుడు పేద ముస్లిం లకు ఇచ్చే రిజర్వేషన్లు తొలగిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. మత పరంగా ముస్లింలను శత్రువులుగా చూస్తే ఎలా అన్న ఆయన హోంమంత్రి రాజ్యంగ విరుద్ధంగా ఎలా మాట్లాడుతారన్నారని ప్ర‌శ్నించారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగించడం అమిత్ షా తరం కాదన్నారు. అమిత్ షా పై రాజ్యాంగ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అమిత్ షా వాఖ్యల పై సుప్రీంకోర్టులో పిటీషన్ వేస్తానన్నారు. అమిత్ షా ఒక వర్గానికి మాత్రమే హోంమంత్రి కాదని, ఈ దేశానికి అన్న విషయం మర్చిపోయినట్లున్నాడన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్నానని చెప్పుకునే ఈటలకు ఇన్ని కోట్లు ఎలా వచ్చాయని షబ్బీర్‌అలీ (Shabbir Ali) ప్రశ్నించారు.

మునుగోడు ఉప ఎన్నికలు జరిగిన 6 నెలల తర్వాత ఈటల ఇప్పుడు ఆరోపణలు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈటల రాజేందర్‌ కాంగ్రెస్ లోకి వస్తా అని తమ పార్టీ తలుపులు తట్టలేదా? అని అడిగాడు. ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవగాహన లోపానికి పరాకాష్ట అని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మల్లు రవి అన్నారు.

ముస్లిం మత పరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అని అమిత్ షా అనడం రిజర్వేషన్లు అమలు విషయంలో ఆయనకు అవగాహన లేదన్నారు. ముస్లిం మతంలోని అణగారిన వర్గాలకు మాత్రమే ఈ రిజర్వేషన్ల ను అమలు చేస్తారన్నారు.

కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా నిన్న చేవెళ్ల మీటింగ్‌లో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్‌ అన్నారు. బీజేపీ ఇన్నర్ ఎజెండాను అమిత్ షా బహిర్గతం చేశాడన్నారు. వేదాలలో, భగవద్గీత సారాంశంలో కూడా ప్రతి జీవిలో నేనున్నానని దేవుడు చెప్పాడన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రాముడు కూడా ఎవరికి వ్యతిరేకం కాదన్న విషయాన్ని బీజేపీ వాళ్ళు అర్థం చేసుకోవాలన్నారు. 7జూలై 2007 లో పేద ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తమ ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. అయితే ఈ రిజర్వేషన్లు 15 శాతం ఉన్న ముస్లిం లందరికీ రావని, కేవలం పేద ముస్లింలకు మాత్రమే వస్తాయన్నారు. పేదలకు వచ్చే లబ్దిని వ్యతిరేకించడం పద్ధతి కాదని ఆయన బీజేపీకి హితవు పలికారు.