Ranjan Gogoi | రాజ్యసభలో.. రంజన్ గగోయ్‌కు షాక్! నలుగురు మహిళా ఎంపీల వాకౌట్
Ranjan Gogoi తొలి ప్రసంగం చేసిన మాజీ సీజేఐ న్యూఢిల్లీ: నామినేటెడ్ సభ్యుడు, మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్‌కు రాజ్యసభలో షాక్ తగిలింది. ఆయన సోమవారం తొలి ప్రసంగం చేశారు. అయితే.. ఆయన ప్రసంగాన్ని నిరసిస్తూ నలుగురు మహిళా ఎంపీలు జయాబచ్చన్ (సమాజ్‌వాది), ప్రియాంక చతుర్వేది (శివసేన (ఉద్ధవ్)), వందనా చవాన్ (ఎన్సీపీ), సుశ్మితదేవ్ (టీఎంసీ) సభ నుంచి వాకౌట్ చేశారు. గగోయ్ సీజేఐగా ఉన్నప్పుడు 2019లో ఒక మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న […]
Ranjan Gogoi
- తొలి ప్రసంగం చేసిన మాజీ సీజేఐ
న్యూఢిల్లీ: నామినేటెడ్ సభ్యుడు, మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్‌కు రాజ్యసభలో షాక్ తగిలింది. ఆయన సోమవారం తొలి ప్రసంగం చేశారు.
అయితే.. ఆయన ప్రసంగాన్ని నిరసిస్తూ నలుగురు మహిళా ఎంపీలు జయాబచ్చన్ (సమాజ్‌వాది), ప్రియాంక చతుర్వేది (శివసేన (ఉద్ధవ్)), వందనా చవాన్ (ఎన్సీపీ), సుశ్మితదేవ్ (టీఎంసీ) సభ నుంచి వాకౌట్ చేశారు.
గగోయ్ సీజేఐగా ఉన్నప్పుడు 2019లో ఒక మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే.. ఆ ఆరోపణలను ఖండించిన గగోయ్.. సున్నితమైన అంశాల్లో సీజేఐ కార్యాలయాన్ని చైతన్య రహితం చేసేందుకు ఒక పెద్ద శక్తి చేసిన ప్రయత్నమని పేర్కొన్నారు.
ఈ ఆరోపణలపై సుప్రీం కోర్టు నియమించిన కమిటీ విచారణ జరిపి, గగోయ్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. తనపై వచ్చిన ఆరోపణపై విచారించేందుకు అత్యవసర బెంచ్‌ను గగోయ్ ఏర్పాటు చేయడం కూడా విమర్శలకు గురైంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram