SIIMA | RRR సినిమా విడుదలై భారీ విజయంతో ప్రేక్షకులను అలరించింది. సినిమా స్టోరీ పరంగానే కాకుండా మేకింగ్ కూడా ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇక ఆస్కార్ వరకూ వెళ్ళి సత్తా చాటి తెలుగు సినిమా ప్రతిష్టను మరింతగా పెంచేసింది. అయితే దీని వెనుక దర్శక దిగ్గజం రాజమౌళి పడిన కష్టం ఎంత ఉందో నటులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా అంతే కష్టపడ్డారు. ఈ సినిమాకు ముందు వీరి మధ్య మామూలు స్నేహమే ఉన్నా, RRR […]
SIIMA |
RRR సినిమా విడుదలై భారీ విజయంతో ప్రేక్షకులను అలరించింది. సినిమా స్టోరీ పరంగానే కాకుండా మేకింగ్ కూడా ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇక ఆస్కార్ వరకూ వెళ్ళి సత్తా చాటి తెలుగు సినిమా ప్రతిష్టను మరింతగా పెంచేసింది. అయితే దీని వెనుక దర్శక దిగ్గజం రాజమౌళి పడిన కష్టం ఎంత ఉందో నటులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా అంతే కష్టపడ్డారు.
ఈ సినిమాకు ముందు వీరి మధ్య మామూలు స్నేహమే ఉన్నా, RRR తర్వాత ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అయితే వీరిమధ్య స్నేహం కుదిరినంత ఈజీగా వీళ్ళ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య స్నేహం కుదరడం లేదు. RRR సినిమా విషయంలో మొదలైన రచ్చ అలా కొనసాగుతూనే వస్తోంది.
సరే ఆస్కార్ తర్వాత గొడవ సర్దుమణిగిందిలే అనుకుంటే.. ఇప్పుడు మళ్ళీ అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య చిచ్చు రాజుకుంటోంది. ఇది తాటాకు చప్పుళ్ళలా కాకుండా రావణ కాష్టంలా ఎక్కడ పెరిగి అంతా దహించేస్తుందోనని అటు సినీ వర్గాలు, సోషల్ మీడియా అంతా హడలిపోతున్నారు. అసలు సంగతి ఏంటంటే..
ఫ్యాన్స్ మధ్య హీరోల గురించి పోటీ ఉండటం, ఒకరిని ఒకరు తిట్టుకోవడం మామూలే.. సోషల్ మీడియా వేదికగా మీమ్స్ తో ట్రోల్ చేయడం కూడా ఇప్పుడు మామూలు విషయమే అయింది. అయితే ఇప్పుడు ఇద్దరు పెద్ద హీరోల మధ్య చిచ్చు రేపుతూ రేపు పెద్ద వార్ కి తెరలేపనున్నారట ఈ ఫ్యాన్స్.
ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించిన ఆర్ ఆర్ ఆర్ బాక్సాఫీస్ వద్ద గొప్ప సంచలనంగా నిలిచింది. అలాగే ఆస్కార్ విజేతగానూ నిలిచింది. రాజమౌళి తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప చరిత్రను సృష్టిస్తే.. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు గ్లోబల్ స్టార్‌డమ్‌ని అందుకున్నారు.
తాజాగా సైమా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ నామినేషన్స్‌ని రిలీజ్ చేశారు. ఇందులో బెస్ట్ యాక్టర్ ఇన్ ఎ లీడింగ్ రోల్‌గా ఓ యాక్టర్ ని సెలక్ట్ చేయబోతున్నారు. దీనికి గాను సైమా సోషల్ మీడియా హ్యాండిల్లో, అఫీషియల్ సైట్స్‌లో పోస్ట్ రిలీజ్ చేసింది.
ఇందుకు గాను హీరోలను ఎంచుకుని మీకు నచ్చిన హీరోని నామినేట్ చేయండనే ప్రకటన ఇచ్చింది. ఆ లిస్ట్‌లో ముందుగా అడివి శేష్ (మేజర్), దుల్కర్ సల్మాన్(సీతా రామం), నిఖిల్ సిద్ధార్థ్ (కార్తికేయ 2), సిద్ధు జొన్నలగడ్డ (DJ టిల్లు)లతో పాటు ఎన్టీఆర్ (RRR), రామ్ చరణ్ (RRR) విడివిడిగా నామినేట్ అయ్యారు.
ఇందులోంచి బెస్ట్ యాక్టర్‌ని ఎన్నుకోవాలని చెప్పారు. ఈ కారణంగా ఎవరిని ఎంచుకోవాలనే మాటే వస్తే మా హీరో అంటే మా హీరో అనే రచ్చ మొదలవుతుందని, అది ఎంతవరకూ పోతుందో చెప్పలేమనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఓ రేంజ్లో ట్రోలింగ్ అవుతున్న విషయం.