OTT: వేశ్యలను చంపే కిల్లర్.. ఓటీటీలో అదిరిపోయే కొరియన్ థ్రిల్లర్! తెలుగులో.. ఎందులో ఉందంటే?

OTT:
విధాత సినిమా: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు చాలా రోజుల తర్వాత ఓ కొరియన్ (South Korean) యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ది చేజర్ (The Chaser) డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. 2008లో రూపొంది థియేటర్లలో సంచలన విజయం సాధించడంతో పాటు భారీ వసూళ్లు తెచ్చి పెట్టిన ఈ సినిమాను ఇప్పుడు తెలుగుతో పాటు మరో రెండు భాషల్లో అందుబాటులోకి తీసుకు వచ్చారు. నా హాంగ్-జిన్ (Na Hong Jin) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కిమ్ యూన్-సియోక్ (Kim Yoon Seok), హా జంగ్ వూ (Ha Jung woo), సీయో యంగ్ హీ (Seo Young Hee) , పార్క్ హ్యో జూ (Park Hyo Joo), జంగ్ ఇన్ గి (Jung In gi) , కిమ్ యో జంగ్ (Kim Yoo Jung ) కీలక పాత్రల్లో నటించారు.
కథ విషయానికి వస్తే.. గతంలో పోలీస్ డిటెక్టివ్‌గా పనిచేసిన జూంగ్ (Eom Joong ho) ఆ తర్వాత అర్థిక పరిస్థితులతో ఆ పని వదిలేసి కొంతమంది అమ్మాయిలతో ప్రాస్టిట్యూషన్ బిజినెస్ చేస్తుంటాడు. ధనవంతులకు, ఫోన్‌లో అడిగిన వారికి అమ్మాయిలను పంపిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో విటుల దగ్గరకు పోయిన ఇద్దరు అమ్మాయిలు మిస్ అవగా వారిని వెతికే పనుల్లో ఉంటారు. అదే సమయంలో ఓ అమ్మాయిని పంపించాలంటూ ఓ యువకుడు జి యోంగ్-మిన్ (Ji Yeong-min) నుంచి ఫోన్ వస్తే మీ జిన్ అనే వేశ్య (Kim Mi-jin) ను పంపిస్తాడు. సరిగ్గా జూంగ్‌కు అదే సమయంలో గతంలో మిస్ అయిన అమ్మాయిలు ఆ యువకుడి దగ్గరికే వెళ్లాకే కనిపించకుండా పోయారని అర్థమై మీ జిన్‌ను జాగ్రత్తగా ఉండాలని అతడి ఇంటి అడ్రస్ పంపించాలని చెప్పి అతగి కోసం వెతుకుతూ ఉంటాడు..
మరో వైపు అ వేశ్య ఇంట్లోకి అడుగు పెట్టగానే అక్కడి పరిస్థితి అర్థమై తన బాస్‌కు సమాచారం ఇవ్వాలని చూస్తుంది గానీ సిగ్నల్స్ లేక కాల్స్, మెసేజ్‌లు వెళ్లవు. అక్కడి నుంచి తప్పించుకోవాలని చూసినప్పటికీ సాధ్య పడదు. ఈ క్రమంలో ఆ కిల్లర్ జిన్‌ను కట్టి పడేసి చంపబోతుండగా ఓ వృద్ధ దంపతులు తమకు తెలసిన వారి అచూకీ కోసం ఆ ఇంటి కాలింగ్ బెల్ కొడతారు. తన రహస్యం వాళ్లు ఎక్కడ బయట పెడతారో అని వారిని చంపి వారి కారును ఎక్కడో దూరంగా ఫార్క్ చేసి వద్దామని ప్రయత్నిస్తున్న సందర్భంలో కిల్లర్ కోసం వెతుకుతున్న జూంగ్ కారుతో యాక్సిడెంట్ అయి అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ సమయంలో తాను వెతుకుతున్న కిల్లర్ అతనే అని జూంగ్ తెలుసుకుని ఇంటి అడ్రస్, అమ్మాయిలు ఎక్కడున్నారో చెప్పాలని దాడికి దిగుతాడు. ఆపై పోలీసులు రావడంతో కథ స్టేషన్‌కు మారుతుంది. అక్కడ తానే ఇకరిద్దరు కాదని 12 మందిని చంపానంటూ ఆ సీరియల్ కిల్లర్ చెబుతుంటాడు గానీ పోలీసులు నమ్మరు. ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోవద్దు అంటూ జూంగ్‌ను అక్కడి నుంచి పంపేస్తారు. ఆ తర్వాత పై అధికారుల జోక్యంతో కిల్లర్‌ను కూడా వదిలేస్తారు. కానీ ఎవరూ అతని ఇంటి అడ్రస్ తెలుసుకోలేక పోతారు.
ఈ నేపథ్యంలో జూంగ్ ఏం చేశాడు.. ఆ సీరియల్ కిల్లర్ ఇంటి అడ్రస్ ఎలా కనిపెట్టాడు, అతను ఎందుకు అమ్మాయిలను చంపుతున్నాడు, చివరకు కిల్లర్‌ను పట్టుకో గలిగాడా లేదా.. ఆ ఇంట్లో బందీగా ఉన్న జిన్‌ను కనిపెట్టారా చివరకు ఏమైందీ అనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతుంది. ఇప్పుడీ ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ (OTT) లో తెలుగు, తమిళ భాషల్లో స్టీమింగ్ అవుతోంది. కొరియన్ సినిమాలు ఇష్టపడే వారు, మంచి థ్రిల్లర్ చూడాలనుకునే వారు ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవకుండా చూసేయవచ్చు. ఎక్కడా ఎలాంటి అసభ్యత, అశ్లీలత లేదు కానీ వయలెన్స్ సన్నివేశాలు కాస్త ఇబ్బంది పెడతాయి. ఇదిలాఉంటే ఈ సినిమా రిలీజైన 2008లో ఆ యేడు హయ్యేస్ట్ గ్రాసర్‌గా నిలవడంతో పాటు పాతిక పైనే జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కించుకోవడం విశేషం. సౌత్ కొరియన్ మోస్ట్ వయలెంట్ టాప్ 10 చిత్రాల్లో ఈ ది చేజర్ (The Chaser) సినిమా చోటు సాధించడం గమనార్హం.