SR DG School | బాలికతో PET అసభ్య ప్రవర్తన.. పాఠశాల ఫర్నిచర్ ధ్వంసం
SR DG School విధాత: రాజేంద్రనగర్ అత్తాపూర్ ఎస్‌ఆర్ డీజీ స్కూల్ లో 8 తరగతి విద్యార్థిని పట్ల పీఈటీ విష్ణు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థినికి ఫోన్లు చేసి పీఈటి ఇబ్బంది పెట్టగా, విషయాన్ని బాలిక తన తల్లిందండ్రులకు చెప్పడంతో వారు పాఠశాల వద్ధకు చేరుకుని దాడికి దిగారు. తల్లిదండ్రులు, వారి బంధువులు స్కూల్ లో ఉన్న ఫర్నీచర్, కంప్యూటర్ రూమ్‌ను ధ్వంసం చేశారు. స్కూల్ లో ఉన్న ప్రిన్సిపాల్ పై, ఇతర […]
SR DG School
విధాత: రాజేంద్రనగర్ అత్తాపూర్ ఎస్‌ఆర్ డీజీ స్కూల్ లో 8 తరగతి విద్యార్థిని పట్ల పీఈటీ విష్ణు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థినికి ఫోన్లు చేసి పీఈటి ఇబ్బంది పెట్టగా, విషయాన్ని బాలిక తన తల్లిందండ్రులకు చెప్పడంతో వారు పాఠశాల వద్ధకు చేరుకుని దాడికి దిగారు.
తల్లిదండ్రులు, వారి బంధువులు స్కూల్ లో ఉన్న ఫర్నీచర్, కంప్యూటర్ రూమ్‌ను ధ్వంసం చేశారు. స్కూల్ లో ఉన్న ప్రిన్సిపాల్ పై, ఇతర ఉపాధ్యాయుల పై దాడి చేయగా పీఈటీ పత్తా లేకుండా పారిపోయాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.
విద్యార్థిని తల్లిదండ్రులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విద్యార్ధి సంఘాలు పాఠశాల వద్ధకు చేరుకుని నిరసన వ్యక్తం చేశాయి. సంఘటనపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని, పీఈటీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram